లండన్ లో బాహుబలి స్పెషల్ షో నిర్వహించి.. 148 ఏళ్ల చరిత్రలో ప్రదర్శింపబడిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించిన రాజమౌళి.. ఆ ఈవెంట్ కు అందరూ సూపర్ స్టైలిష్ గా అటెండ్ అయితే.. తాను మాత్రం పంచెకట్టు-కండువాతో తెలుగుదనం ఉట్టిపడేలా తన వస్త్రధారణ ఉండేలా జాగ్రత్తపడి.. భారతీయతను చాటి చెప్పాడు. అలాగే.. లండన్ లో రాజమౌళిని కలిసిన కొందరు చైనీయులు ఆయనతో ఫోటోలు తీసుకోవడానికి క్యూ కడుతూ.. అదే సమయంలో “ఆర్.ఆర్.ఆర్” కోసం ఎంక్వైరీ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇక లండన్ లో రాజమౌళి క్రేజ్ మరియు ఆయన వస్త్రధారణ చూసినవాళ్ళందరూ.. రాజమౌళి దర్శకత్వ ప్రతిభతోపాటు ఆయనకు మాతృ భూమి మీద ఉన్న అభిమానాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. ట్విట్టర్ సాక్షిగా అందరూ “సాహోరే రాజమౌళి” అంటున్నారు. బాహుబలి దర్శకుడు రాజమౌళి నుంచి రాజమౌళి అంటేనే ఒక బ్రాండ్ అనే రేంజ్ కు తన ఇంటర్నేషనల్ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న రాజమౌళి ఎంతైనా చరితార్ధుడు.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!
