లాక్ డౌన్ వల్ల ఇప్పటికే మూడు నెలలపాటు షూటింగ్ లకు బ్రేక్ పడింది. నిర్మాతలకు పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చాయి. దీంతో నాలుగవ విడత లాక్ డౌన్ నుండీ కొన్ని సడలింపులు ప్రభుత్వం ఇవ్వడంతో..సినీ ఇండస్ట్రీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని.. ఇండస్ట్రీ పెద్దలు కూడా ప్రభుత్వం నుండీ పర్మిషన్లు తెచ్చుకున్నారు. ముందుగా రాజమౌళితో ‘ఆర్.ఆర్.ఆర్’ ట్రయిల్ షూటింగ్ చేయించి.. పెద్ద సినిమా షూటింగ్ లకు లైన్ క్లియర్ చేయించాలి అని మన పెద్దలు భావించారు. అయితే రాజమౌళి తో ట్రయిల్ షూట్ అవసరం లేకుండానే తక్కువ మంది క్రూ తో..
కొన్ని నిబంధనల నడుమ షూటింగ్ లు జరుపుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. చిన్న సినిమాల షూటింగ్ లు ఆల్రెడీ మొదలయ్యాయి. అయితే పెద్ద సినిమాల షూటింగ్ లు రాజమౌళి.. ‘ఆర్.ఆర్.ఆర్’ ట్రయిల్ షూట్ ను బట్టి ప్రారంభిద్దాం అనుకున్నారు. చరణ్,ఎన్టీఆర్ డూప్ లతో ‘ఆర్.ఆర్.ఆర్’ ట్రయిల్ షూట్ ను మొదలు పెడదాం అనుకున్న రాజమౌళికి .. అది అసాధ్యమని తెలిసిపోయింది. చిన్న సినిమాలకు అయితే పర్వాలేదు కానీ.. పెద్ద సినిమాల విషయంలో ప్రభుత్వం నియమించిన నిబందనలను పాటిస్తూ షూటింగ్ చెయ్యడం అసాధ్యమని ఫిక్స్ అయ్యి మొత్తం ట్రయిల్ షూట్ ను క్యాన్సిల్ చేసాడట.
నిజానికి సోమవారం నాడు ట్రయిల్ షూట్ ను రాజమౌళి మొదలు పెడదాం అనుకున్నాడు కానీ అది బుధవారానికి మారింది. నిన్న కూడా కష్టం అని భావించి టోటల్ గా క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది. రాజమౌళి వల్లే కాలేదు అంటే.. మిగిలిన స్టార్ హీరోల సినిమా షూటింగ్ లు మొదలవ్వడం ఇప్పట్లో కష్టమే అని అంతా భావిస్తున్నారు. అయితే టీవీ సీరియల్స్, జబర్దస్త్ వంటి షోల షూటింగ్ లకు మాత్రం ఎటువంటి అడ్డంకి లేనట్టు తెలుస్తుంది.
Most Recommended Video
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!