ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా చరణ్, ఎన్టీఆర్ అభిమానులతో పాటు సగటు సినీ అభిమానిని కూడా నిరుత్సాహానికి గురి చేసింది. 2020లో ఓ భారీ పీరియాడిక్ ఫిక్షనల్ వండర్ ఎంజాయ్ చేయబోతున్నాం అని, సంబరపడిన ప్రేక్షకుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ అనేక కారణాల చేత అనుకున్న విధంగా జరగని క్రమంలో వాయిదా పడుతుందని అందరూ భావించారు. ఐతే జులై అనుకున్నది అక్టోబర్ కి మారవచ్చు అనుకున్నారు. కానీ ఆర్ ఆర్ ఆర్ 2021 జనవరి 8కి వాయిదాపడింది. అంటే కొంచెం అటూ ఇటూగా మరో ఏడాదికి గాని ఆర్ ఆర్ ఆర్ థియేటర్స్ లోకి రాదు. చరణ్ కనీసం 2019లో వినయ విధేయ రామ చిత్రంతో పలకరించారు, ఎన్టీఆర్ మాత్రం స్క్రీన్ పై కనిపించి ఏడాది దాటిపోయింది.
ఐతే ఎన్టీఆర్, చరణ్ అభిమానులతో పాటు ఆర్ ఆర్ ఆర్ అభిమానులకు 2020లో చాలా ట్రీట్స్ ఉన్నాయి. ఈ ఏడాది ఎన్టీఆర్, చరణ్ లుక్స్ మరియు టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ ఇలా అనేక సర్ప్రైజెస్ కలవు. వచ్చే నెల 27న చరణ్ పుట్టిన రోజు కానుకగా అల్లూరిగా చరణ్ లుక్ పరిచయం చేయాలని జక్కన్న భావిస్తున్నాడని సమాచారం, అదే జరిగితే మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజున కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ విడుదల చేస్తారు. ఇక దసరాకు ఆర్ ఆర్ ఆర్ టీజర్ విడుదల చేస్తారట. ఇక నవంబర్ లో దివాళి కానుకగా ట్రైలర్ విడుదల అయ్యే ఆస్కారం ఉంది. ఆర్ ఆర్ ఆర్ లో దాదాపు ఏడెనిమిది సాంగ్స్ ఉంటాయని తెలుస్తుంది. డిసెంబర్ లేదా నవంబర్ నుండి పాటల సందడి మొదలవనుంది. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ 2021 కి వాయిదా పడినా 2020లో జక్కన్న ఇన్ని అప్డేట్స్ ఫ్యాన్స్ కొరకు సిద్ధం చేసి ఉంచారు.
Most Recommended Video
జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!