Rajasekhar: శేఖర్ మూవీ రిలీజ్ డేట్ ఇదేనా?

2021 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేదనే సంగతి తెలిసిందే. అయితే 2022 సంక్రాంతికి మాత్రం ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ మొదలు కావడంతో జనవరి 7వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావడం గ్యారంటీ అని తెలుస్తోంది. మరోవైపు పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన రాధేశ్యామ్ రిలీజ్ డేట్ మారే అవకాశం లేదని సమాచారం. ఈ సినిమాలతో పాటు నాగార్జున బంగార్రాజు సినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు బోగట్టా.

అయితే సీనియర్ హీరో రాజశేఖర్ తన సినిమా “శేఖర్” ను సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. థియేటర్లు దొరికితే ఈ సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి రిలీజవుతుందని సమాచారం. జనవరి రెండో వారంలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఒక సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయడం సాధ్యం కాని పక్షంలో జనవరి లాస్ట్ వీక్ లో ఈ మూవీ రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. సంక్రాంతికి పోటీ పెరుగుతున్నా ఆ సమయానికి కొన్ని సినిమాలు పోటీ నుంచి తప్పుకునే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో 500 కోట్ల రూపాయల కలెక్షను సాధించే అవకాశాలు ఉన్నాయి.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus