Katrina Kaif: స్టార్ హీరోయిన్ పై మంత్రి వ్యాఖ్యలు.. మండిపడుతోన్న నెటిజన్లు!

ఒక్కోసారి రాజకీయ నాయకులు ఇచ్చే స్పీచ్ లు వివాదాస్పదంగా మారుతుంటాయి. తాజాగా రాజస్థాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ కు చెందిన మంత్రి రాజేంద్ర సింగ్.. గుదాఝాంజును జిల్లాలోని తన నియోజకవర్గం ఉదయ్‌పూర్‌వాటిలో బహిరంగ సమావేశం నిర్వహించారు. దీనిలో పెద్ద సంఖ్యలో స్థానికులు హాజరయ్యారు. ఈ క్రమంలో మంత్రి స్పీచ్ ఇస్తూ.. తన నియోజక వర్గంలోని రోడ్లు బాలీవుడ్‌ నటి

కత్రినా కైఫ్‌ బుగ్గల మాదిరిగా ఉన్నాయని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు అక్కడున్నవారంతా నవ్వారు. కానీ ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. నెటిజన్లు మంత్రిపై మండిపడుతున్నారు. దీనిపై కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ ప్రియాంకగాంధీ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మహిళలకు ప్రాముఖ్యత ఉంటుందని పలుసభల్లో ప్రియాంక గాంధీ తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయా దుమారాన్ని రేపుతున్నాయి. ప్రతిపక్షాలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. 2005లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ బిహార్‌ రహదారిని త్వరలో నటి హేమమాలిని బుగ్గల మాదిరిగా మారుస్తామని అన్నారు. దీనిపై అప్పట్లో పెద్ద గొడవ జరిగింది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus