ఈ ఏడాది థియేటర్లలో విడుదలైన ఇండియన్2 (Bharateeyudu 2) మూవీ ఒకింత భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసింది. ఈ సినిమాలో శంకర్ మార్క్ అస్సలు లేదని సాంగ్స్, బీజీఎం పూర్తిస్థాయిలో నిరాశ పరిచాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపించాయి. అయితే ఇండియన్2 ప్రభావం గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాపై పడుతుందేమోనని అభిమానులు ఒకింత టెన్షన్ పడ్డారనే సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ సినిమాలో కీలక పాత్రలో నటించిన రాజీవ్ కనకాల (Rajiv Kanakala) ఇండియన్2 ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్ పై అస్సలు ఉండదని చెబుతూ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
గేమ్ ఛేంజర్ సినిమాలో ఒక్కో సాంగ్ కోసం 10 నుంచి 12 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని వెల్లడించారు. గేమ్ ఛేంజర్ సినిమాలో సీన్లు బాగుంటాయని రాజీవ్ కనకాల పేర్కొన్నారు. గేమ్ ఛేంజర్ మూవీ షూట్ సమయంలో చాలా ఎంజాయ్ చేశామని ఆయన తెలిపారు. ఇండియన్2 మూవీకి గేమ్ ఛేంజర్ కు కథ పరంగా ఎలాంటి పోలికలు ఉండవని చరణ్ గ్లోబల్ స్టార్ అని ప్రస్తుతం చరణ్ (Ram Charan) రేంజ్ వేరే లెవెల్ అని ఆయన పేర్కొన్నారు.
శంకర్ (Shankar) సినిమాలో సాంగ్స్ అంటే భారీ స్థాయిలో ఉంటాయని గేమ్ ఛేంజర్ బ్రహ్మాండమైన సినిమా అని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. గేమ్ ఛేంజర్ గురించి రాజీవ్ కనకాల చేసిన కామెంట్లు ఒకింత అంచనాలు పెంచేశాయని చెప్పవచ్చు. గేమ్ ఛేంజర్ సినిమా బాలీవుడ్ లో సైతం రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదల కానుంది.
శంకర్ ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేసి ప్రేక్షకుల మెప్పు పొందడం ఖాయమని తెలుస్తోంది. దిల్ రాజుకు (Dil Raju) ఈ సినిమా కథ ఎంతగానో నచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఔట్ పుట్ విషయంలో దిల్ రాజు పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారని సమాచారం.