పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో పవన్ కామెడీ టైమింగ్ తగ్గింది. ఒకప్పుడు బ్రహ్మానందం(Brahmanandam), మల్లికార్జున్ (Mallikarjuna Rao), అలీ(Ali) వంటి స్టార్లతో కలిసి పవన్ కామెడీ ఇరగదీసేవారు. కానీ ఇప్పుడు పవన్ కామెడీ టైమింగ్ ను మ్యాచ్ చేసే స్టార్స్ లేరు. సీనియర్ హీరోలైన నరేష్ (Naresh), రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) వంటి వాళ్ళతో నటించే ఛాన్స్ ఉన్నా.. ఎందుకో పవన్ సినిమాల్లో అది కుదరడం లేదు. తాజాగా ఈ అంశంపై రాజేంద్రప్రసాద్ స్పందించారు.
అందరి హీరోలతో యాక్ట్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ తో ఎందుకు చేయలేదు? అంటూ ఓ వ్యక్తి ప్రశ్నించాడు.అందుకు రాజేంద్రప్రసాద్… “పవన్ కళ్యాణ్ మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన మాట్లాడుతూ..’నేను అన్నయ్య కోసం మద్రాసు వెళ్తే.., నన్ను రాజేంద్ర ప్రసాద్ దగ్గరకి పంపేవారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఉదయం నుండి సాయంత్రం వరకు షూటింగ్ చూపించి.. సాయంకాలం నాకు బట్టలు కూడా కొనిపెట్టారు. నాకు చిరంజీవి (Chiranjeevi) మాత్రమే కాదు.. రాజేంద్రప్రసాద్ కూడా అన్నయ్యే’ అన్నారు. నాకు పవన్ తో చనువు ఎక్కువ. సొంత తమ్ముడు కంటే ఎక్కువ.
అతను కూడా నాతో అంత బాగా ఉంటాడు. కానీ ఎందుకో మా ఇద్దరికీ సింక్ అయ్యే సరైన పాత్ర పడలేదు. కానీ కచ్చితంగా మా ఇద్దరి కాంబినేషన్లో మంచి పాత్ర పడుతుంది. పవన్ నన్ను చాలా ప్రేమిస్తారు. త్వరలోనే మీరు మా కాంబినేషన్ చూస్తారు. మంచి రైటర్ల చేతిలో ఉంది అది. నేను ఎప్పుడూ మంచి రచనపైనే ఆధారపడే వాడిని” అంటూ చెప్పుకొచ్చారు. పవన్ ను (Pawan Kalyan) మినహాయిస్తే.. మహేష్ బాబు (Mahesh Babu) , జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), అల్లు అర్జున్ (Allu Arjun) వంటి స్టార్స్ తో రాజేంద్రప్రసాద్ కలిసి నటించడం జరిగింది.