‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ (S/O Satyamurthy) సినిమా నుండి ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ లోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram) . వాస్తవానికి ‘జులాయి’ (Julayi) తోనే వీరి ప్రయాణం మొదలైంది. కానీ మధ్యలో ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ (ఎస్.వి.సి.సి) బ్యానర్లో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ‘అత్తారింటికి దారేది’ (Atharintiki Daaredi) అనే సినిమాని చేశారు. ఆ తర్వాత త్రివిక్రమ్ చేసిన సినిమాలు అన్నీ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్లోనే. రైటర్ గా చేయాల్సి వచ్చినా అది ‘హారిక..’ వారి హోమ్ బ్యానర్ అయిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ లో చేశారు.
మధ్య ‘పీపుల్ మీడియా..’ వారి ‘బ్రో’ కి పని చేసినా అది పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కోసమే చేశారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ దశలో త్రివిక్రమ్.. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ ను వదలడా? అనే ప్రశ్న వచ్చినప్పుడు నాగవంశీ(Suryadevara Naga Vamsi).. “అది బాబాయ్ చినబాబు (S. Radha Krishna), త్రివిక్రమ్ గారు కలిసి పెట్టిన బ్యానర్. దానిని త్రివిక్రమ్ గారు ఎలా వదులుకుంటారు?” అంటూ ఆయన బదులివ్వడం జరిగింది.
సో త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలు బయట బ్యానర్లలో ఉండవు అనే అభిప్రాయానికి కూడా ఇండస్ట్రీ వర్గాలు వచ్చేశాయి. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ మనసు మార్చుకున్నట్టు కనిపిస్తుంది.విషయం ఏంటంటే.. వెంకటేష్ (Venkatesh ) సినిమా తర్వాత రాంచరణ్ తో (Ram Charan) ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్ వల్ల ఈ కాంబో సెట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్.
ఈ నేపథ్యంలో ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ లో కాకుండా బయట బ్యానర్లో త్రివిక్రమ్ సినిమా చేయాల్సి ఉందట. రాంచరణ్ 17వ సినిమాగా ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ బయట బ్యానర్లో కూడా సినిమాలు చేస్తారా? లేక ఈ ఒక్క ప్రాజెక్టు మాత్రమే చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
RC17 – LOCKED
Ram Charan – Trivikram combo to kick off in mid-2026, post Venkatesh’s film
The project will be backed by a new production house ✌#RC17 #RamCharan #TrivikramSrinivas #Trivikram pic.twitter.com/clFxenq8fF
— Phani Kumar (@phanikumar2809) May 28, 2025