Rajinikanth, Kamal Haasan: రిటైర్మెంట్‌ అన్నారు.. నాలుగేసి సినిమాలతో రెచ్చిపోతున్నారుగా!

సీనియర్‌ స్టార్‌ హీరో… ఈ మాట చాలా బరువైంది. ఎందుకంటే ఈ ట్యాగు తగిలాక ఆ హీరో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని హిట్లు గతంలో ఇచ్చాం అనేది పక్కకు వెళ్లిపోతుంది. వరుసగా మంచి సినిమాలు చేయాలి, భారీ విజయాలు సాధించాలి, అలాగే వసూళ్లు కూడా అదిరిపోవాలి అని ఆశిస్తుంటారు అభిమానులు. దీంతో స్టార్లు సీనియర్లు అయ్యాక జోరు తగ్గిపోతుంటుంది. లెక్క కట్టి సినిమాలు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఇద్దరు సీనియర్‌ స్టార్‌ హీరోలు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు.

ఇక్కడో విషయం ఏంటంటే… ఆ హీరోల పని అయిపోయింది, త్వరలో రిటైర్‌మెంట్‌ అని ఆ మధ్య వార్తలు రావడమే. వాళ్లే రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌. కోలీవుడ్‌లో ఆ మాటకొస్తే మొత్తం సౌత్‌లో వీళ్లకున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, క్రేజ్‌ చాలా స్పెషల్‌. అయితే వారిలో మ్యాజిక్‌ అయిపోయిందని, సరైన విజయాలు ఇక కష్టం అని చురకలు వినిపించేవి. వాళ్ల నుండి సినిమా వస్తే చాలు ఇలాంటి పుకార్లు వచ్చేవి. అయితే ఒక్క సినిమా ఒక్కటంటే ఒకే సినిమాతో మొత్తం పరిస్థితి మార్చేశారు ఇద్దరూ.

కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’ సినిమాతో, ‘జైలర్‌’ సినిమాతో రజనీకాంత్‌ చేసిన మేజిక్‌ మీకు తెలిసిందే. ఆ సినిమాలు ఇచ్చిన విజయాలతో ఇప్పుడు ఇద్దరూ చెరో నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. రిటైర్‌మెంట్‌ అనుకున్న మాటల్ని ఇప్పుడు రీఎంటర్‌టైన్‌మెంట్‌ అనేలా చేశారు. కావాలంటే మీరే చూడండి కమల్ హాసన్‌ లైనప్‌లో ఇప్పుడు ‘భారతీయుడు 2’, ‘కల్కి 2898 AD’, ‘థగ్ లైఫ్’ సినిమాలతోపాటు అన్బుఅరివ్‌ డైరక్షన్‌లో ఓ సినిమా చేయాలి. ఇక రజనీకాంత్ లిస్ట్‌లో అయితే ‘లాల్ సలామ్’, ‘వేటగన్‌’ ఉన్నాయి. ఇవి కాకుండా లోకేష్ కనగరాజ్ సినిమా, ‘జైలర్ 2’ లైన్‌లో ఉన్నాయి.

అయితే వీళ్లు ఈ రేంజిలో విజయం సాధించే ముందు, నాలుగే సినిమాలు చేసే ముందు ఓ వ్యక్తి సౌత్‌ల ఈ స్థాయిలో లైనప్‌ పెట్టారు. ఆయనే లేటెస్ట్‌ పద్మవిభూషణ్‌ మెగాస్టార్‌ చిరంజీవి. ‘ఖైదీ నెం 150’ తో రీఎంట్రీ ఇచ్చాక ఆయన తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘సైరా’ చేశారు. ఆ తర్వాత ఏకంగా సెట్స్‌పై నాలుగు సినిమాలు పెట్టారు. ఇప్పుడు (Rajinikanth, Kamal Haasan) రజనీ, కమల్‌ కూడా ఇదే ఉత్సాహంతో నాలుగు సినిమాలు లైన్‌లో పెట్టారు అంటున్నారు నెటిజన్లు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus