కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎలాంటి సినిమా చేసినా తెలుగులో కూడా అదే తరహాలో విడుదల అవుతాయి. ఒకప్పుడు అయితే టాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా తలైవా సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకునేవి. అయితే రోబో అనంతరం మాత్రం రజనీకాంత్ రేంజ్ బాగా తగ్గినట్లు అనిపిస్తోంది. ఇక ఈసారి అన్నత్తై సినిమాతో ఎలాగైనా మళ్ళీ బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు.ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ 12కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు 30కోట్లకు పైగా బిజినెస్ చేసిన రజని ఇప్పుడు మాత్రం 10కోట్ల వసూళ్లను అందుకోవడం కోసం చాలా కష్టపడాల్సి వస్తోంది. తలైవా కమర్షియల్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అంతగా రుచించడం లేదని తెలుస్తోంది. చివరగా దర్బార్ సినిమా 14.2కోట్లకి తెలుగులో అమ్ముడవ్వగా 10కోట్ల షేర్ కూడా రాలేదు. అంతకుముందు పేట 13కోట్లుకు మాత్రమే అమ్ముడయ్యింది. ఇక 2పాయింట్ ఓ 71కోట్లు, కాలా, 33కోట్లు, కబాలి 31కోట్లతో తెలుగులో విడుదలవ్వగా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ అవ్వలేదు.
ఇక అన్నత్తై సినిమాపై తెలుగులో అయితే పెద్దగా అంచనాలు లేవు. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో భారీగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. మరి సినిమా ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో కీర్తి సురేష్, నయనతార, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు