Rajinikanth,Sr NTR: రజనీ చూసిన తొలి సినిమా ఎన్టీఆర్‌దే.. ఏ సినిమా అంటే?

రజనీకాంత్‌ అంటే స్టైల్‌.. స్టైల్‌ అంటే రజనీకాంత్‌. ఇన్నేళ్లుగా మనకు తెలిసింది ఇదే. సినిమాల్లో స్టైల్‌కి మారుపేరుగా ఆయన పేరు ఉంది అంటే.. ఏ రేంజిలో ఆయన ఇంపాక్ట్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ స్టైల్‌కి కారణం ఎవరు అనే విషయాన్ని ఆయన వెల్లడించారు. బస్‌ కండక్టర్‌గా ఉన్న సమయంలో నిర్వహించిన ఓ వేడుకలో ఎన్టీఆర్‌ను ఊహించుకుంటూ దుర్యోదన పాత్రకు అభినయించా అని చెప్పుకొచ్చారు రజనీ. ఆ పాత్రకు దక్కిన ప్రశంసల వల్లే నటన వైపు వచ్చాను అని రజనీకాంత్‌ తెలిపారు.

ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకను ఇటీవల విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన రజనీకాంత్ మాట్లాడుతూ ఎన్టీఆర్‌తో ఉన్న తన అనుబంధాన్ని వివరించారు. ‘‘నేను తొలిసారి చూసిన సినిమా ఎన్టీఆర్‌ ‘పాతాళభైరవి’. ఆ సినిమా ఎప్పటికీ నా మదిలో నిలిచిపోయింది. నా తొలి సినిమాలో ‘భైరవి ఇల్లు ఇదేనా?’ అనే సంభాషణ ఉంటుంది అని గుర్తు చేశారు రజనీకాంత్‌. ‘శ్రీకృష్ణ పాండవీయం’ సినిమాలోని ఎన్టీఆర్‌ నటించిన దుర్యోదన పాత్రకు మంత్రముగ్దుణ్ని అయ్యాను అని కూడా చెప్పారు.

రజనీకాంత్‌ (Rajinikanth) సహాయ నటుడిగా, ప్రతినాయకుడిగా సినిమాలు చేస్తున్న రోజుల్లో ఓ దర్శకుడు వచ్చి.. హీరోగా సినిమా చేస్తానని చెప్పారట. అయితే అప్పటికి ఆయనకు హీరోగా నటించడం ఇష్టం లేదట. దాంతో ఆ దర్శకుడు ‘ఒకసారి కథ వినండి’ అంటూ సినిమా పేరు ‘భైరవి’ అని చెప్పారట. ఆ పేరు వినగానే ఆ సినిమలో నటించడానికి ఓకే చెప్పేశారట. ‘లవకుశ’ సినిమా విజయోత్సవ వేడుకకు ఎన్టీఆర్‌ చెన్నైకు వెళ్లినప్పుడు..

దూరం నుండి ఆయన్ను చూశాను నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు రజనీకాంత్‌. ‘లవకుశ’ సినిమా విజయోత్సవం సమయంలో తన వయసు 13 ఏళ్లని చెప్పారు. ఎన్టీఆర్ నటించిన ‘లవకుశ’, ‘శ్రీకృష్ణపాండవీయం’, ‘దాన వీర శూర కర్ణ’ లాంటి సినిమాలు అనేకసార్లు చూశానని చెప్పారు రజనీకాంత్‌. ఎన్టీఆర్‌తో కలసి సినిమా చేసిన రోజులు ఎప్పటికీ మర్చిపోలేనని, ఆ తరువాత తనకి నటుడిగా మరిన్ని అవకాశాలు వచ్చాయని రజనీకాంత్‌ చెప్పారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus