Rajinikanth, Chiranjeevi: ఏప్రిల్ 14న వెటరన్ హీరోల వార్!

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. అయితే ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద తలపడిన సందర్భాలు లేవు. అది కూడా ఒకేరోజు ఢీ కొట్టిన దాఖలాలు కూడా కనిపించవు. కానీ 2023లో మాత్రం ఇది తప్పేలా లేదు. చిరంజీవి నటిస్తోన్న ‘భోళాశంకర్’ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా కోసం బ్రేక్ ఇచ్చారు కానీ రిలీజ్ డేట్ ని టార్గెట్ గా పెట్టుకొనే దర్శకుడు మెహర్ రమేష్ వర్క్ చేస్తున్నారు.

అజిత్ నటించిన ‘వేదాళం’ సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు కానీ మెహర్ రమేష్ మాత్రం చాలా నమ్మకంగా ఉన్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా రజినీకాంత్ నటిస్తోన్న ‘జైలర్’ సినిమాను కూడా ఏప్రిల్ 14నే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్ చేస్తున్నారు.

అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. రజినీకాంత్ కి ఈ మధ్యకాలంలో సరైన హిట్టు లేదు. అయినప్పటికీ ఆయన సినిమాల విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పైగా అందరూ కుర్ర దర్శకులతోనే పని చేస్తున్నారు. ‘జైలర్’, ‘భోళా శంకర్’ సినిమాల రిలీజ్ కు మరో ఐదు నెలల సమయం ఉంది కాబట్టి ఏమైనా మార్పులు జరుగుతాయేమో చూడాలి.

‘రోబో’ సినిమా తరువాత ఆ స్థాయి హిట్టు లేక తెలుగులో రజినీకాంత్ మార్కెట్ చాలా డల్ అయింది.మరోపక్క చిరంజీవికి సరైన హిట్టు పడడం లేదు. ‘గాడ్ ఫాదర్’ సినిమాకి హిట్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం లేవు. ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా హిట్ అయితే అప్పుడు ‘భోళాశంకర్’పై అంచనాలు పెరిగే ఛాన్స్ ఉంది. మరేం జరుగుతుందో చూడాలి!

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus