11 ఏళ్ళ క్రితం.. ఎవ్వరూ ఊహించని విధంగా రజినీకాంత్ పై నాగార్జున పైచేయి సాధించారు..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే తమిళంలో కాదు తెలుగులో కూడా హాట్ టాపిక్ అవుతుంది. ఆయన సినిమా రిలీజ్ అయ్యింది అంటే ఆడియన్స్ థియేటర్ల ముందు క్యూలు కట్టేస్తారు. తమిళంలో అయితే స్కూల్స్ కి సెలవులు కూడా ఇచ్చేస్తారు. అయితే తెలుగులో ఇప్పుడు రజినీకాంత్ (Rajinikanth)  సినిమాలకి కొంచెం హడావిడి తగ్గిన మాట వాస్తవం. ‘వేట్టయన్’ కి (Vettaiyan) హిట్ టాక్ వచ్చినా దానికి ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు.

Rajinikanth, Nagarjuna

కానీ రజనీ అప్ కమింగ్ మూవీ ‘జైలర్’ (Jailer) పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఈ సినిమాకి దర్శకుడు కావడంతో ట్రేడ్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే రూ.42 కోట్లు రేటు పలుకుతుంది ‘కూలి’ (Coolie) చిత్రం. ‘కూలి’ లో ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే.. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున (Nagarjuna) కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. సైమన్ అనే నెగిటివ్ రోల్లో నాగార్జున నటిస్తున్నారు.

సినిమాలో రజినీకాంత్ కంటే ఎక్కువగా నాగార్జున పాత్రే హైలెట్ అవుతుంది అనే టాక్ కూడా ఉంది. ఇదిలా ఉంటే..గతంలో నాగార్జున సినిమా పక్కన రజినీకాంత్ సినిమా చిత్తు చిత్తు అయ్యింది అనే సంగతి తెలుసా. నమ్మేలా లేకపోయినా ఇది నిజం. 2014 లో ఈ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.

మే 23న రజనీకాంత్ నటించిన ‘విక్రమసింహ’ (Vikram Simha) రిలీజ్ అయ్యింది. అయితే ఇది ఊహించని విధంగా ప్లాప్ అయ్యింది. ఎందుకంటే ఇది యానిమేషన్ కైండ్ ఆఫ్ మూవీ. మరోపక్క ఇదే రోజున నాగార్జున నటించిన ‘మనం’ (Manam) రిలీజ్ అయ్యింది. ఇది సూపర్ హిట్ అయ్యింది. నేటితో ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యి 11 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

‘కుబేర’ టీంకి కొత్త టెన్షన్.. వర్కౌట్ అవుతుందా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus