Rajinikanth: ధనుష్ మాత్రమే కాదు రజినీ కూడా అదే బాటలో..!

ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ డైరెక్టర్లు పరభాషా హీరోలతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయడానికి తమిళ స్టార్ హీరో ధనుష్ రెడీ అయ్యాడు. అదే సమయంలో ‘తొలిప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరితో కూడా ధనుష్ సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరిగింది. ఆ ప్రాజెక్టుని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారు నిర్మించబోతున్నట్టు కూడా కథనాలు వినిపించాయి. దానిని నిజం చేస్తూ రేపు ఆ ప్రాజెక్టు టైటిల్ ను అనౌన్స్ చేస్తున్నట్టు

‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారు అధికారికంగా ప్రకటించారు. అయితే శేఖర్ కమ్ములతో ధనుష్ సినిమా ఆగిపోయిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ధనుష్.. వెంకీ అట్లూరి సినిమా గురించి ట్వీట్ చేస్తూ ‘ఇది నా మొదటి స్ట్రైట్ తెలుగు సినిమా’ అని పేర్కొన్నాడు. దాని పై కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. ఇక ధనుష్ తర్వాత శివ కార్తికేయన్ కూడా ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఓ బైలింగ్యువల్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు.

వీరి బాటలోనే ఇప్పుడు రజినీకాంత్ కూడా అడుగులు వేస్తున్నట్టు తాజా సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం.. ఓ టాలీవుడ్ దర్శకుడు ఇటీవల రజినీ కాంత్ ను కలిసి ఓ కథని వినిపించాడట. ఇది రజినీకాంత్ కు విపరీతంగా నచ్చేసింది. దాంతో ఆయన వెంటనే ఓకే చెప్పేసారట. ‘రోబో’ తర్వాత రజినీకాంత్ తెలుగులో ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయారు. దాంతో ఆయన మార్కెట్ బాగా పడిపోయింది. ‘పెద్దన్న’ చిత్రం వచ్చి వెళ్ళిపోయినట్టు కూడా చాలా మందికి తెలీదు

అంటే ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఆ టాలీవుడ్ దర్శకుడితో సినిమా చేసి తెలుగులో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus