సినిమా అంటే మనకి 3 గంటల ఎంటర్టైన్మెంట్ మాత్రమే అనుకుంటాం. అది హిట్ అయితే హీరో, హీరోయిన్ లకు అలాగే దర్శకనిర్మాతలకి మాత్రమే పేరొస్తుంది. అయితే ఓ సినిమా తయారవ్వడానికి ఎంతో మంది కష్టం ఉంటుంది. ఓ సినిమా ఎంతో మందికి ఉపాది కల్పిస్తుంది అనే విషయాన్ని గుర్తించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు కరోనా దెబ్బకు షూటింగ్ లు అన్నీ ఆగిపోయాయి.
ఈ సినిమా పై ఆధారపడి జీవించేవారు ఇప్పుడు నిత్యావసరాలకు డబ్బులు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇది గుర్తించి చాలా మంది సినీ ప్రముఖులు వారికి సాయం చేయడానికి విరాళాలు ప్రకటిస్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమ విషయంలో కూడా ఇదే రిపీట్ అవుతుంది.తాజాగా ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా..(ఎఫ్.ఈ.ఎఫ్.ఎస్.ఐ) కు రజినీకాంత్ 50 లక్షలు డొనేట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇలాంటి విషయాల్లో రజినీ ఎప్పుడూ ముందుంటారు అన్న సంగతి అందరికీ తెలిసిందే.
అందుకే ఆయన్ని సూపర్ స్టార్ అని అంటుంటారు. ఇక మరో క్రేజీ హీరో విజయ్ సేతుపతి కూడా 10 లక్షలు డొనేట్ చేస్తున్నట్టు ప్రకటించారు. సినిమా వాళ్లు ఇలా చేయడం వల్ల నిత్య అవసరాల ఖర్చులు అయినా వారికి వచ్చే అవకాశం ఉంటుంది. వీరిని బట్టి .. మరికొందరు సెలబ్రిటీలు కూడా వీరికి సాయం చెయ్యడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది.