లాక్ డౌన్ ఎఫెక్ట్ వల్ల చాలా మందికి ఉపాది లేకుండా పోయింది. చాలా వరకూ కంపెనీలు మూత పడ్డాయి. సినీ ఇండస్ట్రీలో కూడా షూటింగ్ లు ఆగిపోయాయి. దీంతో రోజూ వారి కూలీ పై ఆధారపడి జీవించే వారి కుటుంబాలకు పూట గడవని పరిస్ధితి ఏర్పడింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి పెద్ద మనసుతో ‘కరోనా క్రైసిస్ ఛారిటీని(సిసిసి) ఏర్పాటు’ చేసి విరాళాలు సేకరిస్తున్నారు. మన హీరోలు, నిర్మాతలు, సీనియర్ ఆర్టిస్ట్ లు, కమెడియన్ లు వారికి తోచిన విరాళం అందించారు.
హీరోయిన్ లలో ప్రణీత మొదటగా 50 కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. ఇక లావణ్య త్రిపాఠి కూడా లక్ష రూపాయలు విరాళం అందించడంతో పాటు మాస్క్ లు, శానిటైజర్లు పంపిణీ చేసింది. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. కరోనా లాక్‌డౌన్ కారణంగా రకుల్ ప్రీత్ సింగ్ తన తండ్రితో కలిసి గుర్గావ్‌లోని స్లమ్ ఏరియాలో ఉన్న 250 కుటుంబాలకు రెండు పూటల అన్నం పెట్టిస్తుంది ఈ బ్యూటీ.
ఎప్పటి వరకూ లాక్‌డౌన్ ఉంటుందో అప్పటి వరకూ ఇలాగే కొనసాగిస్తామని చెబుతూ ఓ వీడియో విడుదల చేసింది రకుల్. మరోవైపు యాంకర్ రష్మీ కూడా మూగ జీవాలకు తన వంతుగా సాయం చేస్తుంది. ఏదేమైనా ఇలాంటి పరిస్థితుల్లో.. ఇలాంటి హీరోయిన్లు ముందుకు రావడం మంచి పరిణామమే అని చెబుతున్నారు.
Most Recommended Video
అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!