సెలబ్రిటీల అందం, ఫిట్నెస్ గురించి సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వస్తుంటాయి. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందంటూ ఓ వార్త నెట్టింట వైరల్ అయ్యింది. దీనిపై రకుల్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ‘ఫ్రాడ్ అలర్ట్’ అంటూ విరుచుకుపడ్డారు.ఇన్‌స్టాగ్రామ్‌లో డాక్టర్ ప్రశాంత్ యాదవ్ అనే వ్యక్తి రకుల్ ‘బిఫోర్ అండ్ ఆఫ్టర్’ ఫోటోలను పోల్చుతూ ఓ వీడియో పోస్ట్ చేశారు.
ఆమె బొటాక్స్, ఫిల్లర్స్, నోస్ జాబ్ వంటి కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుందని ఆరోపించారు. కేవలం ఫిట్‌నెస్ వల్లే ఇలా అయ్యానని రకుల్ చెబుతూ.. జనాన్ని పక్కదారి పట్టిస్తోందంటూ కామెంట్ చేశారు.ఈ వీడియోపై రకుల్ ప్రీత్ సింగ్ ఘాటుగా స్పందించారు. తన ఇన్‌స్టా స్టోరీలో ఆ వీడియోను షేర్ చేస్తూ.. “వైద్యులమని చెప్పుకునే ఇలాంటి వ్యక్తులు ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడటం చూస్తుంటే భయమేస్తోంది.

ఇలాంటి ఫేక్ ప్రచారాలను నమ్మకండి” అంటూ ఫ్యాన్స్‌ను అలర్ట్ చేశారు.తాను సర్జరీలకు వ్యతిరేకం కాదని, ఎవరైనా చేయించుకుంటే తప్పుపట్టనని రకుల్ క్లారిటీ ఇచ్చారు. కానీ తాను మాత్రం కష్టపడి వర్కవుట్స్ చేసి, బరువు తగ్గడం వల్లే తన లుక్‌లో మార్పు వచ్చిందన్నారు. ‘హార్డ్ వర్క్ వల్ల వెయిట్ లాస్ అవుతారని ఎప్పుడూ వినలేదా?’ అంటూ ఆ డాక్టర్‌కు రకుల్ గట్టిగానే సమాధానం ఇచ్చారు.
ఇక రకుల్ ప్రీత్ సింగ్ కి ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేవు. అడపాదడపా హిందీలో పలు సినిమాల్లో నటిస్తుంది. తమిళంలో చేసిన ‘ఇండియన్ 3’ ఆగిపోయింది.
