Rakul Preet Singh: అందులో దాచిపెట్టడానికి ఏముంది..? రిలేషన్షిప్ పై రకుల్ వ్యాఖ్యలు!

బాలీవుడ్ లో ప్రేమలు, బ్రేకప్ లు చాలా కామన్. ఇప్పటికీ రోజుకో ఎఫైర్ బయటపడుతూనే ఉంది. కానీ ఎవరూ ఓపెన్ గా బయటకుచెప్పరు. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ లు ప్రేమలో ఉన్నారనే విషయాన్ని పెళ్లి జరిగే వరకు అఫీషియల్ గా చెప్పలేదు. కియారా అద్వానీ కూడా సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉంది. కానీ ఆ విషయాన్ని మాత్రం అఫీషియల్ గా ఒప్పుకోదు. తను మాత్రం ఆ టైప్ కాదని అంటోంది రకుల్ ప్రీత్ సింగ్.

ప్రొడ్యూసర్ జాకీ భగ్నన్నీతో రకుల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్ లో రకుల్ పుట్టినరోజు సందర్భంగా ఇద్దరూ తమ రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ప్రకటించారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో దీని గురించి రకుల్ కి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇండస్ట్రీలో ఇంత పెద్ద సెలబ్రిటీ అయి ఉండి ఇంత ఓపెన్ గా ప్రేమ గురించి ఎలా చెప్పగలిగారని ప్రశ్నించగా.. రకుల్ నవ్వేసింది. ‘ఇందులో దాచిపెట్టడానికి ఏముందసలు! రహస్యంగా దాక్కుని పరుగులు పెట్టేవారు చాలామంది ఉన్నారు.

కానీ మేమిద్దరం ఆ టైప్ కాదు. మాకసలు అలాంటి ఆలోచనలే రావు. ప్రేమలో పడటం తప్పు కాదు. మేం ఒకర్నొకరం గౌరవించుకుంటాం. మా రిలేషన్‌నీ గౌరవిస్తాం. అందుకే ఓపెన్‌గా చెప్పేశా’ అని వెల్లడించింది. సీక్రెట్ గా రిలేషన్స్ మెయింటైన్ చేసే ఉద్దేశం తనకు లేదని నేరుగా చెప్పేసింది రకుల్. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో చాలా బిజీగా గడుపుతుంది. దాదాపు అరడజనుకుపైగా సినిమాల్లో నటిస్తోంది రకుల్. వీటిలో రెండు సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus