Rakul Wedding: పెళ్లిపై రూమర్స్ సృష్టించకండి : రకుల్ ప్రీత్

తన పుట్టినరోజు నాడు ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. అప్పటినుంచి ఆమె పెళ్లిపై పుకార్లు వస్తున్నాయి. ఈ నెలలోనే ఆమె పెళ్లి చేసుకుంటుందని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థలు ఆమె ఇప్పటికే పెళ్లి చేసేసుకుందని వార్తలు రాశారు. దీనిపై రకుల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తను ఇంకా జాకీ భగ్నానీ ప్రేమనే పూర్తి స్థాయిలో ఆస్వాదించలేదని.. అప్పుడే పెళ్లి ఏంటంటూ ఫైర్ అయింది.

ప్రేమ విషయాన్ని ఎలాగైతే తను స్వయంగా వెల్లడించిందో.. అలానే పెళ్లి విషయాన్ని కూడా స్వయంగా వెల్లడిస్తానని క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా మీడియాకు సమాచారం ఇచ్చిన తరువాతే పెళ్లి చేసుకుంటానని స్పష్టంగా చెప్పింది. ప్రస్తుతం తన చేతిలో పది సినిమాలు ఉన్నాయని.. దయచేసి పెళ్లిపై రూమర్స్ సృష్టించి తనను డిస్టర్బ్ చేయొద్దని కోరింది. ఈ సందర్భంగా జాకీకి, తనకు మధ్య బాగా కనెక్ట్ అయిన విషయాలను కూడా బయటపెట్టింది రకుల్. ‘మేమిద్దరం ఒకేలా ఆలోచిస్తాం.

కుటుంబం, పని, బంధువులకు మేమిద్దరం ఇచ్చే ప్రాధాన్యత ఒకేలా ఉంటుంది. ఇవి మాత్రమే కాదు, ఉదయాన్నే ఇద్దరం వర్కవుట్స్ చేయడాన్ని ఇష్టపడతాం. మా ఇద్దరికీ ఆరోగ్యకరంగా తినడం ఇష్టం. అందుకేనేమో మేం బాగా కనెక్ట్ అయ్యాం’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రకుల్ తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ పై పెట్టింది. ఆమె నటించిన నాలుగు సినిమాలు హిందీలో విడుదల కాబోతున్నాయి. తెలుగులో ఆమె చివరిగా ‘కొండపొలం’ అనే సినిమాలో కనిపించింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus