టాలీవుడ్ లో అతి కొద్దికాలంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీత్. దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేసింది. యంగ్ హీరోలను కూడా కవర్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ మధ్యకాలంలో రకుల్ గ్లామరస్ రోల్స్ తో పాటు ప్రయోగాలు కూడా చేస్తుంది. ఈ క్రమంలో ‘ఛత్రివాలి’ అనే బాలీవుడ్ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. ఇందులో రకుల్ కండోమ్ టెస్టర్ రోల్ లో నటించడానికి సిద్ధమైపోయింది.
ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఒకింత అసహనం వ్యక్తం చేశారు. రకుల్ తో పాటు దర్శకనిర్మాతలకు కూడా ట్రోల్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందని సమాచారం. ఈ సినిమాను నిర్మించాలనుకున్న రోనీ స్క్రూవాలా ఇప్పుడు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయిపోయారు. ఇప్పటికే సినిమాపై నెగెటివిటీ స్ప్రెడ్ అవుతుండడం చూసిన రోనీ.. రిలీజ్ టైమ్ కి వివాదం మరింత ముదిరే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
అందుకే ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేయాలని ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమాతో నటిగా తనలోని కొత్త కోణాన్ని ప్రెజెంట్ చేయాలనుకున్న రకుల్ ఇదొక షాక్ అనే చెప్పాలి. మరి దర్శకుడు తేజస్ కి కొత్త ప్రొడ్యూసర్ దొరుకుతారేమో చూడాలి. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లో ఐదారు సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో ఆమె నటించిన ‘కొండపొలం’ సినిమా విడుదలకు సిద్ధంగాఉంది .