మెగాస్టార్ తనయుడిగా కెరీర్ ను మొదలుపెట్టినా తక్కువ సమయంలోనే రామ్ చరణ్ స్టార్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకుని తండ్రికి తగ్గ తనయుడిగా ఇండస్ట్రీలో సత్తా చాటారు. చరణ్ హీరోగా నటించిన సినిమాల్లో ఫ్లాప్ అయిన సినిమాల కంటే హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను సాధించిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ హీరో మిగతా స్టార్ హీరోలకు ఒక విషయంలో భిన్నమని సమాచారం.
ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు భారీగా పారితోషికాలను పెంచి నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. మరి కొందరు హీరోలు రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నారు. అయితే చరణ్ మాత్రం మిగతా స్టార్ హీరోలతో పోలిస్తే ప్రస్తుతం తక్కువ మొత్తం పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. ఆచార్య సినిమాలో చరణ్ పాత్ర సెకండాఫ్ కు మాత్రమే పరిమితం కావడంతో ఈ సినిమా కోసం చరణ్ 20 కోట్ల రూపాయలు తీసుకున్నారని తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ సినిమాకు మాత్రం చరణ్ 35 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని సమాచారం. మిగిలిన హీరోలతో పోలిస్తే చరణ్ నిర్మాతల విషయంలో ఉదారంగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. మిగతా హీరోలు కూడా చరణ్ లా వ్యవహరిస్తే నిర్మాతలకు ప్రయోజనం చేకూరుతుంది. చరణ్ ప్రస్తుతం ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో నటిస్తుండగా ఈ రెండు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. చరణ్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సి ఉంది.