రాజమౌళిని టాలీవుడ్‌లో జక్కన్న అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆయనకు ఆ పేరు పెట్టించి ఎన్టీఆర్ అనే విషయం తెలిసిందే. అయితే రాజమౌళికి అంతకుమించిన పేర్లు చాలానే ఉన్నాయి. తాజాగా మరో పేరు పెట్టారు రామ్‌చరణ్. హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్ కోసం అమెరికాకు ఇప్పటికే చేరుకున్న రామ్‌చరణ్ అక్కడి ప్రముఖ మీడియా ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో గుడ్ మార్నింగ్ అమెరికా ప్రోగ్రామ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ షోలో పాల్గొన్న తొలి తెలుగు నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈ క్రమంలో రాజమౌళి గురించి రామ్‌చరణ్ చెప్పిన మాటలు వైరల్‌గా మారాయి. రాజమౌళి తెరకెక్కించిన అపురూపమైన సినిమాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఒకటి. అని చెప్పిన రామ్‌చరణ్.. ఆయన్ని తామంతా స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఆఫ్ ఇండియాగా పిలుచుకుంటామని తెలిపారు. ఆయన తన నెక్స్ట్ సినిమాతో గ్లోబల్ సినిమాలోకి అడుగు పెడతారనుకుంటున్నా అని కూడా చెప్పాడు. అంటే మహేష్‌బాబు సినిమాతో రాజమౌళి గ్లోబల్ డైరక్టర్ అవుతారు అని వస్తున్న మాటలకు చరణ్ ఇప్పుడు చిన్న హింట్ ఇచ్చాడన్నాట.
అన్నట్లు ఈ సినిమా కోసమే రాజమౌళి విదేశీ పర్యటనలు, అక్కడి నిపుణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారని సమాచారం. ‘నాటు నాటు…’ పాటకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గుర్తింపు చూస్తుంటే ఇది భారతీయ సినిమాకు దక్కిన గౌరవం అనుకుంటున్నా అని అన్నాడు. ఈ నెల 24న జరగనున్న హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ ప్రోగ్రాంలో ఓ ప్రజెంటర్. ఆయన ఓ గ్రహీతకు వేదిక మీద పురస్కారం అందించనున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ హీరో చరణ్ కావడం గమనార్హం.
మరోవైపు ఇదే ఇంటర్వ్యూలో రామ్‌చరణ్ త్వరలో తండ్రి కాబోతున్న విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఉపాసన తొలి సంతానాన్ని అమెరికాలో ప్రసవించబోతున్నట్లు చెప్పుకొచ్చారు. హాస్ట్ కమ్ డాక్టర్ అయిన ఆమెనే ఈ ప్రసవం చేయిస్తారని అంటున్నారు. రామ్‌చరణ్ అమెరికాలో మరిన్ని ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నారు. దీంతో త్వరలో మరికొన్ని కొత్త విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంది.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?