Jr NTR, Ram Charan: జపాన్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఆర్ఆర్ఆర్ హీరోలు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఈ ఇద్దరు హీరోలకి ఎలాంటి గుర్తింపు సంపాదించి పెట్టిందో మనకు తెలిసిందే. కేవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ఈ సినిమా సంచలనమైన రికార్డులను సృష్టించింది. ఇలా ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాలను అందుకోవడమే కాకుండా ఇందులోనే నాటు నాటు పాటకు గాను ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో భాగంగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చిన విషయం తెలిసిందే.

ఇలా ఇతర దేశాలలో కూడా ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకున్న ఈ సినిమా జపాన్ లో కూడా అదే స్థాయిలో ఆదరణ సంపాదించుకుంది. ఇక తాజాగా ఈ ఇద్దరు హీరోలకు జపాన్ లో అరుదైన గౌరవం లభించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు ఆర్ఆర్ఆర్ సినిమాతో జపాన్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఈ క్రమంలోనే ప్రముఖ జపాన్ మ్యాగజైన్ ఆన్ ఆన్ కవర్ పేజీ పై ఎన్టీఆర్, చరణ్ ఫోటోలు ఉండడంతో ఇది చూసినటువంటి ఎన్టీఆర్ చరణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒక తెలుగు హీరోల ఫోటోలు జపాన్ మ్యాగజైన్ కవర్ పేజీపై రావడం అంటే ఈ హీరోలకి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం అవుతుంది.

ఈ సినిమా తర్వాత (Jr NTR) ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ కూడా గ్లోబల్ స్టార్స్ గా గుర్తింపు పొందారు.ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు చేస్తున్న సినిమాలన్నీ కూడా ఫాల్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండగా ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus