టాలీవుడ్ స్టార్ హీరోలలో కొందరు హీరోలు వెండితెరపై కనిపించి రెండు సంవత్సరాలు అవుతోంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ లు ఆలస్యం కావడంతో పాటు భారీ చిత్రాలలో నటిస్తూ ఉండటంతో స్టార్ హీరోల సినిమాసినిమాకు గ్యాప్ ఎక్కువగా వస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం చరణ్, ఎన్టీఆర్ ఎక్కువ సమయం కేటాయించారు. చరణ్ ఆర్ఆర్ఆర్ తో పాటు ఆచార్య సినిమాలో నటించగా
ఎన్టీఆర్ మాత్రం అరవింద సమేత సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ మినహా మరే సినిమాలో నటించలేదు. ప్రేక్షకులు తారక్ సినిమా చూసి ఏకంగా 1019 రోజులు అవుతోంది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ అంతకంతకూ ఆలస్యం కాగా ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు వస్తుందని ఎన్టీఆర్ భావిస్తున్నారు. బాహుబలి2 తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ గత సినిమా వినయ విధేయ రామ విడుదలై 927 రోజులు అయింది.
అక్టోబర్ 13వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్, తారక్ అభిమానులను సర్ప్రైజ్ చేయనున్నారు. చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనుండగా రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.