మెగా హీరోలకు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుణ్ లావణ్య పెళ్లి వేడుకలు గ్రాండ్ గా జరగగ ఈ పెళ్లి వేడుకలో పవన్, చరణ్ సింపుల్ గా కనిపించడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయింది. సింప్లిసిటీ విషయంలో పవన్ చరణ్ సేమ్ టు సేమ్ అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం. పవన్, చరణ్ పారితోషికాలు సైతం భారీగా ఉన్నాయి.
పవన్, చరణ్ కాంబినేషన్ లో ఒక భారీ సినిమాను ప్లాన్ చేస్తే మాత్రం ఆ సినిమా బాక్సాఫీస్ ను మామూలుగా షేక్ చేయదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి సైతం ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇంట్రోవర్ట్ అని చరణ్ కూడా మితభాషి అని వెల్లడించారు. పవన్, చరణ్ కాంబినేషన్ వేరే లెవెల్ అని మరి కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలలో నటిస్తుండగా ఈ రెండు సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లో విడుదల కానున్నాయి. ఈ సినిమాలు రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. రామ్ చరణ్ విషయానికి వస్తే చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. గేమ్ ఛేంజర్ డిజిటల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.
275 కోట్ల రూపాయలకు ఈ సినిమా డిజిటల్ హక్కులు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. చరణ్ శంకర్ కాంబో ఈ రేంజ్ లో సంచలనాలు సృష్టించడంతో రిలీజ్ తర్వాత ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. వచ్చే ఏడాది సెకండాఫ్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా కానుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. (Ram Charan) చరణ్ శంకర్ కాంబో ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తుందో చూడాలి.