మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓ వైపు సిల్వర్ స్క్రీన్ సెల్యూలాయిడ్ శంకర్ దర్శకత్వంలో, ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం RC 15 చేస్తూనే తర్వాత సినిమా కోసం కథలు వింటున్నాడు. RRR షూటింగ్ జరుగుతుండగానే ఆచార్య కంప్లీట్ చేసిన చరణ్ ఇప్పుడు మరోసారి ట్రిపులార్ కోసం టైం కేటాయించాడు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్ లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ RRR వరల్డ్ వైడ్ ఏ రేంజ్ లో హంగామా చేసిందో తెలిసిందే..
జక్కన్న దెబ్బకి బాలీవుడ్ బాబులు మరోసారి ఆశ్చర్యపోయారు.. బాహుబలి తర్వాత ప్రపంచ ప్రేక్షకులకు తెలుగు సినిమా సత్తా ఏంటనేది సెకండ్ టైం చూపించారాయన.. నేషనల్ మీడియాతో పాటు ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు కూడా ట్రిపులార్ గురించి చాలా గొప్పగా ఆర్టికల్స్ రాశాయి. ముఖ్యంగా అల్లూరిగా చరణ్, కొమరం భీమ్ గా తారక్ ల నటన గురించి చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది.. కొమరం భీమ్ గా యంగ్ టైగర్ నటవిశ్వరూపాన్ని చూసి స్వయంగా అమిత్ షా పిలిపించుకుని మరీ ప్రశంసించడం మనం చూశాం..
ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తే దాదాపు పదిహేను వారాలకు పైగా టాప్ వన్ లో ఉంది అంటే రామ్, భీమ్ రచ్చ రంబోలా ఏంటనేది తెలుస్తుంది.. ఇప్పుడు ట్రిపులార్ మూవీ మరో ఘనత దక్కించుకోబోతుంది.. జపాన్ దేశంలో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.. దీనికోసం టీం ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యనున్నారు.. తారక్, చరణ్, జక్కన్న జపాన్ పయనమయ్యారు.. చరణ్ వైఫ్ ఉపాసనతో కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి..
ఎప్పటిలానే చెర్రీ పెట్ బ్రాట్ కూడా వారితో ఉంది.. ఇప్పటికే తారక్, రాజమౌళి జపాన్ మీడియాకి ఆన్ లైన్ ఇంటర్వూలిచ్చారు. అక్కడి ప్రేక్షకులను పలకరించబోతున్నారు. భారీ స్థాయిలో అక్టోబర్ 21న ఆర్ఆర్ఆర్ జపాన్ లో రిలీజ్ కానుంది. ఈ మూవీ ఆస్కార్ నామినేషన్స్ సాధించిందంటూ ఆ మధ్య సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో హంగామా జరిగిందో చూశాం.. అది మిస్ అయినా ఆరు నెలల తర్వాత విదేశాల్లో మన తెలుగు సినిమా విడుదలవనుండడం గర్వకారణమనే చెప్పాలి..