టాలీవుడ్ లో పలు సినిమాలకు రచయితగా పని చేసిన కొరటాల శివ మిర్చి సినిమాతో దర్శకుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు. తొలి సినిమాతోనే కొరటాల శివ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ సినిమా తర్వాత చరణ్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్నట్టు ప్రకటన వెలువడింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. అయితే చరణ్ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కొరటాల శివగారితో గతంలో ఒక సినిమా చేయాలని అనుకున్నానని అయితే వేరే కమిట్మెంట్స్ వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని రామ్ చరణ్ వెల్లడించారు. ఏం జరిగినా మంచికే జరుగుతుందని ఎందుకు చెబుతారో ఆచార్య వల్లే తెలిసిందని చరణ్ చెప్పుకొచ్చారు. ఆచార్య సినిమా కోసం ఆ ప్రాజెక్ట్ ఆగిందని అర్థమైందని రామ్ చరణ్ కామెంట్లు చేశారు. కొరటాల శివ సినిమాలలో స్టార్ హీరోలు బుద్ధుడు, వివేకానందుడిలా కనిపిస్తారని చరణ్ అన్నారు.
కథలో బలం ఉంటే యాక్టర్లు ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదని అర్థమైందని చరణ్ కామెంట్లు చేశారు. శివగారి డైలాగ్స్ లోని మాటల్లో పవర్ ఉంటుందని శివగారితో చేయడం బొనాంజా అయితే నాన్నగారితో కలిసి చేయడం డబుల్ బొనాంజా అని చరణ్ కామెంట్లు చేశారు. నేను కష్టపడి పని చేయనని ఇష్టంతో పని చేస్తానని చరణ్ వెల్లడించారు. ధృవ, రంగస్థలం, ఆచార్య, ఆర్ఆర్ఆర్ కెరీర్ లో మరిచిపోలేని సినిమాలు అని చరణ్ కామెంట్లు చేశారు.
ఆచార్య సినిమాలోని పాత్ర తన మనస్సుకు దగ్గరైన పాత్ర అని చరణ్ వెల్లడించారు. తాను చేస్తున్న పని ఏరోజు నాకు కష్టంగా అనిపించలేదని ఆచార్య సినిమా ఏప్రిల్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుందని చరణ్ కామెంట్లు చేశారు. కచ్చితంగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నామని చరణ్ తెలిపారు.