టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ (Ram Charan) నేడు పుట్టినరోజును గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. 1985 సంవత్సరం మార్చి 27వ తేదీన జన్మించిన చరణ్ కెరీర్ పరంగా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని బెస్ట్ డ్యాన్సర్లలో రామ్ చరణ్ ఒకరనే సంగతి తెలిసిందే. నటనలో శిక్షణ తీసుకున్న చరణ్ డ్యాన్స్ లో శిక్షణ తీసుకోకపోయినా ఇంత బాగా డ్యాన్స్ చేస్తుండటం గమనార్హం. రామ్ చరణ్ చిరంజీవి నటించిన మూడు సినిమాల షూటింగ్ లకు మాత్రమే వెళ్లాడు.
బాల్యంలో చరణ్ కు సినిమాలపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదట. ఒకసారి చరణ్ సినీ మ్యాగజైన్ చూడాలని భావించగా అదే సమయంలో చిరంజీవి అక్కడికి రావడంతో చరణ్ గజగజా వణికిపోయాడట. చిరుత సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన చరణ్ కెరీర్ పరంగా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మగధీర మూవీతో 150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ తనదైన ముద్ర వేశారు.
ఆరెంజ్ ఫ్లాప్ తర్వాత కమర్షియల్ సినిమాలకు రామ్ చరణ్ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. మూస ధోరణిలో చరణ్ వెళ్తున్నాడని కామెంట్లు వినిపించిన సమయంలో ధృవ, రంగస్థలం సినిమాలు రామ్ చరణ్ కు నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. మరీ అద్భుతమైన కథ ఉంటే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి సైతం చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
అయితే రామ్ చరణ్ కు బైక్ రైడింగ్ అంటే భయం కాగా గతంలో చాలా సందర్భాల్లో వెల్లడించారు. రామ్ చరణ్ త్వరలో మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. చరణ్ ఒకవైపు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ మరోవైపు సినిమాలలో నటిస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.