మెగాస్టార్ వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన చరణ్, తండ్రి లెగసీని నిలబెడుతూ స్టార్ హీరోగా ఎదిగాడు. దాదాపు 13ఏళ్ల కెరీర్ లో ఇండస్ట్రీ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. మరి చరణ్ ఎంత ఎదిగినా తండ్రి చాటు బిడ్డేనట. చరణ్ తీసుకునే ప్రతి నిర్ణయంలో చిరు హస్తం ఉంటుందట. దశాబ్దాల తన అనుభవాన్ని చిరు కొడుకు చరణ్ అభివృద్ధికి వాడుతారట. సినిమా కథలు, కాంబినేషన్స్, దర్శకుల ఎంపిక వంటి కీలక విషయాలలో తుది నిర్ణయం చిరంజీవిదే నట.
చరణ్ విషయంలో చిరు తీసుకున్న నిర్ణయాలే, అతడు అనతి కాలంలో అంత పెద్ద స్టార్ గా ఎదగడానికి ఉపయోగపడ్డాయి. ఇక తండ్రి గైడెన్స్ లో చరణ్ గొప్ప వ్యాపార వేత్తగా కూడా ఎదుగుతున్నాడు. చరణ్ కి పరిశ్రమపై పట్టు వచ్చాక కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. చిరు కమ్ బ్యాక్ మూవీ ఖైదీ 150 నిర్మించిన చరణ్, చిరుతో గత ఏడాది సైరా నరసింహరెడ్డి అనే భారీ పాన్ ఇండియా చిత్రం తీశారు.
ఇక చిరు చరణ్ లు కలిసి ఆచార్య మూవీలో నటిస్తున్నారు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కూడా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో చరణ్ నిర్మించడం విశేషం. ఇక చరణ్ మరో భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ లో అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నాడు. తండ్రి చిరు మార్గదర్శకుడుగా చరణ్ అనేక రంగాలలో దూసుకుపోతున్నారు.
Most Recommended Video
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్