చిరు సెంటిమెంట్ ని ఫాలో అవుతున్న చరణ్!
- March 7, 2017 / 12:02 PM ISTByFilmy Focus
మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత సినిమాల్లోకి హీరోగా రీ ఎంట్రీ ఇచ్చారు. ఖైదీ నంబర్ 150 మూవీతో కలెక్షన్లు కొల్లగొట్టి బాక్స్ ఆఫీస్ కి చిరు ఎప్పుడూ బాసే అనిపించుకున్నారు. ఇప్పుడు చిరు పాటించిన హిట్ సెంటిమెంట్ నే తనయుడు చరణ్ ఫాలో అవుతున్నారు. ప్రస్తతం చెర్రీ సుకుమార్ దర్శకత్వంలో మొగల్తూరు మొనగాడు అనే సినిమాను చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యములో సాగే ఈ కథలో చరణ్ పల్లెటూరి కుర్రోడిగా కనిపించనున్నారు. విలేజ్ యూత్ గెటప్ అయిన ఎంతో స్టైలిష్ గా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. అందుకోసం చరణ్ సోదరి సుష్మితను స్టైలిష్, కాస్ట్యూమ్ డిజైనర్ గా ఎంపిక చేసుకున్నారు.
ఈమె ఖైదీ నంబర్ 150 లో తండ్రి చిరంజీవి తన డిజైన్స్ తో పాతికేళ్ళు వెనక్కి తీసుకెళ్లింది. యువకుడిలా కనిపించేలా చేసింది. చిత్ర విజయానికి దోహదం చేసింది. అందుకే సుకుమార్ సుష్మితను తన టీమ్ లోకి తీసుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ ఈనెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఇందులో సుష్మిత తన సోదరుడు రామ్ చరణ్ ని ఎలా చూపిస్తుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















