Ram Charan, Gowtam Tinnanuri : చరణ్ – గౌతమ్ సినిమా బ్యాగ్రౌండ్ అదేనట!
- November 16, 2021 / 12:05 PM ISTByFilmy Focus
రామ్ చరణ్ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందని కొన్నేళ్ల క్రితం వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఎవరికవారు సినిమాల్లో బిజీ అయిపోవడంతో ఆ సినిమా ముచ్చటే ఎక్కడా వినిపించలేదు. అయితే ఇటీవల అనూహ్యంగా ఈ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. రామ్‌చరణ్‌తో చాలా ఏళ్లుగా సినిమా చేద్దామనుకుంటున్న అతని స్నేహితుల నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ కాంబినేషన్‌ను ఫిక్స్ చేసి అనౌన్స్ చేసింది. ఈ సినిమా నేపథ్యం స్పోర్ట్స్ అని గతంలోనే వార్తలొచ్చాయి.
ఇప్పుడు చరణ్ ఇమేజ్ మారింది కాబట్టి… కథ మారి ఉంటుంది అని కొందరు అనుకుంటున్నారు. అయితే అలాంటి మార్పేమీ లేదని, గతంలో అనుకున్న క్రీడా నేపథ్య కథనే ముందుకు తీసుకెళ్తున్నారట. చరణ్ కూడా చాలా రోజుల అలాంటి ఓ బ్యాక్‌డ్రాప్ గురించి చూస్తున్నారు. ఇప్పుడు అదే జరగబోతోందట. ప్రస్తుతం రామ్‌చరణ్.. శంకర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయ్యాకే గౌతమ్ సినిమా ఉంటుంది అంటున్నారు. మరోవైపు గౌతమ్… ‘జెర్సీ’ హిందీ రీమేక్ పనుల్లో ఉన్నాడు.

ఈ సినిమా విడుదలయ్యాక చరణ్ సినిమా కథ మీద కూర్చుంటాడని టాక్. ‘మెరుపు’ సినిమాతో చరణ్ సాకర్ ప్లేయర్‌గా కనిపించాలని అనుకున్నాడు. కానీ అప్పుడు వీలవ్వలేదు. ఆ సినిమా మొదలై, ఆగిపోయింది. ఇప్పుడు గౌతమ్ కథతో ఆ కోరిక తీరుతుందేమో.
పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

















