Ram Charan: కొత్త సినిమా విషయంలో చరణ్‌ కీలక నిర్ణయం.. అయితే అంత ఈజీ కాదు!

ఎన్నో అనుకుంటాం.. అన్నీ అవుతాయా ఏంటి? అదేదో సినిమాలో హీరో చాలా బాధగా ఈ మాట చెబుతాడు. అయితే ఈ మాటను కామెడీ చేసి ఇప్పుడు వాడుకుంటున్నారు అనుకోండి. అయితే సీరియస్‌గా అనుకున్నా, కామెడీగా అనుకున్నా ఆ మాట సినిమా వాళ్లకు బాగా సరిపోతుంది. ఎందుకంటే ఎన్నో అనుకుని సినిమాలకు కొబ్బరికాయ కొడతారు. కానీ గుమ్మడి కాయ మాత్రం ఎప్పుడు కొడతారో చెప్పలేం. దీంతో ఆ తర్వాతి సినిమా కొబ్బరికాయ ఎప్పుడు కొడతారో తేలకుండా అయిపోతుంది.

ఇప్పుడు ఎందుకు ఈ వాయిదాల కాన్సెప్ట్‌ గురించి మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా? రామ్‌చరణ్‌ సినిమా గురించే ఈ చర్చ. దాంతో బుచ్చిబాబు సినిమా గురించి కూడా. చరణ్‌ – బుచ్చి కలసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత ఈ సినిమా అనౌన్స్‌ అయ్యింది. అయితే ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం తెలియడం లేదు. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్‌కి సంబంధించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అది కూడా చరణ్‌ మాటల్లోనే.

తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు బుచ్చిబాబు. ఆ తర్వాత తారక్‌తో సినిమా అనుకున్నా.. కుదర్లేదు. దీంతో మరో కథతో రామ్‌చరణ్‌ని మెప్పించి అనౌన్స్‌ చేయించుకున్నారు. గ్రామీణ నేపథ్యం, క్రీడలతో ముడిపడిన కథ అని సమాచారం. గతంలో ఇలాంటి కథతోనే ఎన్టీఆర్‌ సినిమా అన్నారు అనుకోండి. ఆ విషయం పక్కనపెడితే చరణ్‌ సినిమా ఎప్పుడు ముహూర్తం, ఎప్పుడు స్టార్ట్‌ అని గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. బుచ్చిబాబుకు కూడా ఈ ప్రశ్న ఎదురవుతోంది. .

అయితే ఇప్పుడో విషయం తెలిసింది. శంకర్‌ సినిమాకు సంబంధించి విశాఖపట్నంలో ఓ కీలకమైన షెడ్యూల్‌ని పూర్తి చేశాక చరణ్‌ – బుచ్చిబాబు సినిమా ముహూర్తం ఉంటుంది అంటున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయని టాక్‌. జూన్‌ ఆఖరులో కానీ, జులై మొదట్లో కానీ షూట్‌ మొదలవుతుంది అని సమాచారం. బుధవారం.బుచ్చిబాబు పుట్టినరోజు కావడంతో రామ్‌చరణ్‌ ఆయనకి శుభాకాంక్షలు చెబుతూ ‘త్వరలోనే సెట్స్‌పై కలుద్దాం’ అంటూ ట్వీట్‌ చేశారు. దాంతోనే ఈ చర్చ అంతా బయటకు వచ్చింది.

ఆ ట్వీట్‌కి బుచ్చిబాబు స్పందిస్తూ ‘‘నాపైన మీరు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. సినిమా ప్రారంభం కోసం నేను కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నా’’ అంటూ ట్వీట్‌ చేశారు. దీంతో చర్చ కాస్త వైరల్‌గా మారింది. అయితే శంకర్‌ సినిమా సెట్స్‌ మీద ఉన్నప్పుడు ఇవన్నీ అనుకున్నట్లుగా సాగుతాయా అనేది ప్రశ్న.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus