Ram Cahra, NBK: ‘బాలయ్య షోకి ఎప్పుడు వెళ్తారు?’ అని అడిగితే రామ్ చరణ్ ఏమన్నాడంటే..!

‘ఆర్ఆర్ఆర్’ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొనడానికి దాదాపు 20 రోజుల ముందుగానే అమెరికా వెళ్లారు.. న్యూయార్క్‌లో వరల్డ్ పాపులర్ టాక్ షో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ లో పార్టిసిపెట్ చేశారు.. ఈ షోలో పాల్గొన్న ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ చరణే కావడం విశేషం.. ఈ విషయం తెలుసుకుని చరణ్‌ని చూడ్డానికి పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడకు వచ్చారు.. తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి చరణ సైతం సర్‌ప్రైజ్ అయ్యారు..

ప్రోగ్రాం అనంతరం చరణ్ బయటికి రాగానే.. జనాలంతా సెల్ఫీలు, షేక్ హ్యాండ్స్‌ కోసం ఎగబడ్డారు.. వారిని కంట్రోల్ చేయడానికి సెక్యూరిటీ సిబ్బంది కూడా తంటాలు పడ్డారు.. అయితే చరణ్‌ని కలిసి సెల్ఫీ దిగడానికి వచ్చిన ఓ చిన్నారి.. అక్కడే వెక్కి వెక్కి ఏడ్చేసింది.. అప్పటికే వెళ్లిపోదామని కారు దగ్గరికి వెళ్లిన చరణ్.. చిన్నారి ఏడుపు చూసి చలించిపోయారు.. వెంటనే ఏడుస్తున్న చిన్నారి వద్దకు వచ్చి.. షేక్ హ్యాండ్ ఇచ్చి సెల్ఫీ దిగారు. దీంతో ఆ చిన్నారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి..

దీనికి సంబంధించిన పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ తెలుగు మీడియాతో మాట్లాడుతూ.. ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షో లో పాల్గొనడం, అకాడమీ అవార్డ్స్ గురించి మాట్లాడారు.. అలాగే బాలయ్య టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ షోకి చరణ్ రాబోతున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.. ఆయన అమెరికన్ షోలో పాల్గొన్న నేపథ్యంలో బాలయ్య షోకి ఇన్విటేషన్ వస్తే.. వెళ్తారా అన్న ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు..

‘‘అన్‌స్టాపబుల్’ నంబర్ వన్ షో.. టీఆర్పీలు గానీ, ఆ రేటింగ్స్ చూస్తుంటే.. బాలయ్య గారు నిజంగా ‘అన్‌స్టాపబుల్’ గా చేశారు.. చాలా ఎక్కువ సంతోష పడతాను.. ఒక ఇన్విటేషన్ వస్తే నేను కచ్చితంగా చేస్తాను’’ అని చెప్పుకొచ్చారు.. ప్రస్తుతం బాలయ్య షో గురించి చెర్రీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus