మెగాస్టార్ వారసుడిగా తెరమీదికొచ్చిన రామ్ చరణ్ కొంతకాలంగా ఓ హిట్ కోసం కొట్టుమిట్టాడుతున్నాడు. వచ్చిన ఫలితంతోనే పబ్బం గడుపుకోవాల్సిన స్థితి. తెలుగు రాష్ట్రాల్లో అంటే మాస్ మంత్రం జపించి ఎలాగోలా కొంతవరకు నెట్టుకురావచ్చు. కానీ స్టార్స్ కంటే సినిమాలకే మొదటి ప్రాధాన్యం ఇచ్చే ఓవర్సేస్ మాటేంటి..? తెలుగు వారికీ అంతగా రుచించని ‘1-నేనొక్కడినే’ సినిమాకి అగ్రపీఠం కట్టబెట్టిన అదే ప్రేక్షకులు మహేశ్ నటించిన బ్రహ్మోత్సవం సినిమా ఫలితం తెలిసి థియేటర్ గుమ్మం కూడా తొక్కలేదు. దీన్నిబట్టి ఓవర్సేస్ ప్రేక్షకుల తీరు అర్థం చేసుకోవచ్చు. ఆ లెక్కన అక్కడ రామ్ చరణ్ సినిమా అంటే పోస్టర్ చూసే వాడు కూడా కరువే. ఇక్కడ యువ హీరోల పేర్లు రాయాల్సివస్తే రామ్ చరణ్ పేరు మొదటి వరుసలో ఉంటుందేమో అక్కడ మాత్రం ఎక్కడో అడుగున వెతుక్కోవాల్సిన పరిస్థితి.
నాని, నిఖిల్ వంటి యువ హీరోలు అక్కడ మిలియన్ క్లబ్ లో చోటు దక్కించుకుని హవా చాటుతుంటే.. చెర్రీ ఆ దరిదాపుల్లో కూడా చేరుకోలేకపోతున్నాడు. చిరు గెస్ట్ రోల్ వల్ల ‘బ్రూస్లీ’ ఈ లోటు కొంతవరకు తీరుస్తుందంటే మళ్ళీ చేదు అనుభవమే ఎదురైంది. ఈ విషయంలో బాగా వెనకపడ్డ చరణ్ ‘ధృవ’ సినిమాతో ఆ ముందుకు పాకాలని ప్రయత్నం చేస్తున్నాడట. అటు గౌతమ్ మీనన్, మణిరత్నం వంటి దర్శకులతో ఈ మెగా హీరో సినిమాలు చేయాలనుకుంటోంది తన ఇమేజ్ మార్చుకోడానికే. ‘ధృవ’ చెర్రీ ఇదివరకు చేసిన మాస్ సినిమా కాకపోవడం కొంతవరకు కలిసొచ్చే అంశమే. కానీ పూర్తిగా చెర్రీ ప్లాన్ ఫలిస్తుందన్న నమ్మకమైతే లేదు. ఈ సినిమాతో చెర్రీ ఓవర్సేస్ కల నెరవేరినా లేకున్నా చెర్రీ తర్వాతి సినిమాతో అక్కడ మంచి స్పందన రాబట్టుకునే అవకాశముంది. ఎందుకంటే ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ గనుక. పోస్టర్ పై సుకుమార్ పేరుంటే చాలు సెల్యూట్ కొట్టి మరీ టికెట్ కోసం క్యూలో నిలబడేవాళ్ళు అక్కడ ఎంతోమంది ఉన్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.