టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ తన సినిమా ప్రమోషన్స్ లో కూడా రాజకీయాల గురించి మాట్లాడటానికి పెద్దగా ఆసక్తి చూపరు. జనసేన పార్టీ తరపున రామ్ చరణ్ ప్రచారం చేసిన సందర్భాలు కూడా దాదాపుగా లేవు. అయితే రియల్ లైఫ్ లో పాలిటిక్స్ కు దూరంగా ఉన్న చరణ్ రీల్ లైఫ్ లో మాత్రం శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో పాలిటిక్స్ తో సంబంధం ఉన్న పాత్రలో కనిపించనున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చరణ్ పార్టీ పేరు అభ్యుదయ పార్టీ కాగా ఆ పార్టీకి ఓటు వేయాలని చరణ్ ప్రచారం చేస్తున్నారని ప్రస్తుతం అందుకు సంబంధించిన షూట్ జరుగుతోందని బోగట్టా. రాజమండ్రికి సమీపంలో ఈ సినిమా షూట్ కోసం భారీ సెట్ వేయడం గమనార్హం. ట్రాక్టర్ గుర్తుకే ఓటు వేయాలంటూ చరణ్ పార్టీ మీటింగ్ లో ప్రచారం చేశారని బోగట్టా. రీల్ లైఫ్ లో రాజకీయాలకు దగ్గరగా ఉన్న చరణ్ రియల్ లైఫ్ లో కూడా రాజకీయాలపై దృష్టి పెడతారేమో చూడాల్సి ఉంది.
మరోవైపు చరణ్ శంకర్ కాంబో మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి అప్ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది. రామ్ చరణ్, కియారా అద్వానీ కలిసి నటించిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరణ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయలుగా ఉంది. రెమ్యునరేషన్ విషయంలో చరణ్ నిర్మాతలకు అనుకూలంగా ఉంటారని సినిమా ఇండస్ట్రీలో టాక్ ఉంది.
చరణ్ కు ఇతర ఇండస్ట్రీలలో కూడా మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే రామ్ చరణ్ కెరీర్ పరంగా సక్సెస్ కావడం కష్టం కాదని టాక్ ఉంది. రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు. నర్తన్ డైరెక్షన్ లో ఒక సినిమాకు కూడా చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?
2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!