Ram Charan, Jr NTR: ఎన్టీఆర్30 మూవీ కథ విషయంలో ఇన్ని ట్విస్టులా?

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోలుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ ఇద్దరి మధ్య ఆర్.ఆర్.ఆర్ సినిమాకు ముందే స్నేహం ఉన్నా ఒకే సినిమాలో మూడేళ్ల పాటు కలిసి నటించడం వల్ల చరణ్, తారక్ మధ్య అనుబంధం పెరిగింది. చరణ్ మెయిన్ హీరోగా కొరటాల శివ కాంబినేషన్ లో మిర్చి తర్వాత ఒక సినిమా దిశగా అడుగులు పడ్డాయి.
అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు.

ఆచార్య సినిమాకు ముందు కూడా కొరటాల శివ రామ్ చరణ్ కు ఒక కథ చెప్పడం జరిగింది. అయితే అప్పటికే ఇతర సినిమాలతో బిజీ అయిన రామ్ చరణ్ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించలేదు. ప్రస్తుతం తారక్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా చరణ్ రిజెక్ట్ చేసిన కథతోనే తెరకెక్కుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కొరటాల శివ నుంచి ఏమైనా రియాక్షన్ వస్తే మాత్రమే ఈ వార్తలో నిజముందో లేదో తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఎన్టీఆర్30 ఆగిపోయిందని ప్రచారం జరగగా తాజాగా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుకావడంతో ఫ్యాన్స్ కూల్ అయ్యారు. స్లిమ్ లుక్ లో తారక్ యంగ్ గా కనిపిస్తున్నారని నెటిజన్ల నుంచి సైతం కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో తారక్ కు జోడీగా రష్మిక, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు హీరోయిన్లలో ఎవరో ఒకరిని త్వరలో ఫైనల్ చేయనున్నారు.

ఎన్టీఆర్30 లో ఒక హీరోయిన్ రోల్ మాత్రమే ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. తారక్ కు జోడీగా నటించే లక్కీ ఛాన్స్ ను ఏ స్టార్ హీరోయిన్ దక్కించుకుంటారో చూడాలి. జై లవకుశ తర్వాత తారక్ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా ఇదే కాగా యువసుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus