మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా రామ్ చరణ్ ఫుడ్ ఛాలెంజ్ లో పాల్గొని సందడి చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సంబంధించిన ఎన్నో విశేషాలను చరణ్ చెప్పుకొచ్చారు. చిరుదోశ గురించి ప్రశ్నలు ఎదురు కాగా ఆ దోశ కోసం ఏయే పదార్థాలను వినియోగిస్తారో తనకు తెలియదని చరణ్ వెల్లడించారు. స్వీట్స్ కంటే కారంగా ఉండేవే నాకు ఇష్టమని చరణ్ పేర్కొన్నారు.
కుటుంబంలో ఎక్కువగా స్పైసీవి తినేది తాను మాత్రమేనని చరణ్ చెప్పుకొచ్చారు. అయితే తాను భోజనప్రియుడిని కాదని చరణ్ అన్నారు. మాంసాహారం కంటే శాకాహారంను తాను ఎక్కువగా ఇష్టపడతానని చరణ్ చెప్పుకొచ్చారు. హైదరాబాదీ బిర్యానీ అంటే చాలా ఇష్టమని సమయం దొరికితే తాను వంటింట్లో గరిటె తిప్పుతానని చరణ్ పేర్కొన్నారు. అయితే తనకు వంట చేయడం రాదని చరణ్ అన్నారు. చిరు దోశలో ఉపయోగించే పదార్థాల గురించి అమ్మ కూడా ఎప్పుడూ చెప్పలేదని చరణ్ పేర్కొన్నారు.
మొక్కజొన్న అంటే తనకు అస్సలు నచ్చదని చరణ్ కామెంట్లు చేశారు. తినే వంటలలో మొక్కజొన్న లేకుండా జాగ్రత్త పడతానని చరణ్ అన్నారు. తాతయ్య అల్లు రామలింగయ్య స్వాతంత్ర సమరయోధుడని ఎవరికీ తెలియని విషయాన్ని చరణ్ వెల్లడించారు. చాలా తక్కువమందికి మాత్రమే అమ్మ వాళ్ల నాన్న స్వాతంత్ర సమరయోధుడని తెలుసని చరణ్ చెప్పుకొచ్చారు. తాతయ్య హక్కులపై పోరాటం చేశారని తాతయ్యను 15 రోజుల పాటు జైలులో ఉంచారని చరణ్ కామెంట్లు చేశారు. కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ విషయం తెలుసని చరణ్ అన్నారు.
చరణ్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఆర్‌ఆర్‌ఆర్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ కొరకు ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కోసం చరణ్ 45 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది. చరణ్ తర్వాత సినిమా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కనుంది.