ఖరారైన రామ్ చరణ్, సుకుమార్ సినిమా షూటింగ్ ప్రారంభపు తేదీ
- January 21, 2017 / 06:26 AM ISTByFilmy Focus
సూపర్ స్క్రీన్ ప్లే తో అదరగొట్టే డైరక్టర్ సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలయికలో రాబోతున్న మూవీకి ముహూర్తం ఫిక్స్ అయింది. గత ఏడాది నాన్నకు ప్రేమతో చిత్రంతో క్లాస్ హిట్ అందుకున్న డైరక్టర్ ఈ సారి పక్కా గ్రామీణ నేపథ్య కథను ఎంచుకున్నారు. చెర్రీ కూడా విలేజ్ లో పుట్టి పెరిగిన కుర్రోడిగా కనిపించబోతున్నారు. అతనిని ఆటపట్టించే మరదలిగా అనుపమ పరమేశ్వరన్ నటించనుంది. అంతేకాదు ఇందులో మరో బ్యూటీ కూడా అందాలతో అలరించనుంది. ఢిల్లీ భామ రాశీ ఖన్నా చరణ్ తో రొమాన్స్ చేయనుంది.
ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్లు కూడా ఫిక్స్ అయ్యారు. మ్యూజిక్ డైరక్టర్ గా దేవీ శ్రీ ప్రసాద్, కెమెరా మెన్ గా రత్నవేలు పనిచేయనున్నారు. ఈ మూవీని జనవరి 30 వ తేదీ లాంఛనంగా ప్రారంభించాలని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ డిసైడ్ అయింది. ఫిబ్రవరి ఒకటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రంలో ప్రత్యేక లుక్ తో కనిపించాలని చరణ్, అనుపమ కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ధృవ మూవీ తర్వాత చరణ్ చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















