Ram Charan, Jr NTR: తారక్ సూచనల మేరకు చరణ్ ఆ ప్రాజెక్ట్ కు ఒప్పుకున్నారా?

  • November 22, 2022 / 03:03 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోలలో రామ్ చరణ్ ఒకరు కాగా ఆచార్య సినిమా షాకింగ్ రిజల్ట్ నేపథ్యంలో సినిమాల ఎంపిక విషయంలో చరణ్ చాలా మారిపోయారు. నవ్యత ఉన్న కథలకు మాత్రమే రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సినిమా రిజల్ట్ పై ఏ మాత్రం సందేహం ఉన్నా ప్రకటించిన ప్రాజెక్ట్ లను రిజెక్ట్ చేయడానికి కూడా తారక్ ఓకే చెబుతున్నారు. అయితే చరణ్ కొత్త ప్రాజెక్ట్ బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కనుందని సమాచారం.

తారక్ కోసం చాలా రోజుల పాటు ఎదురుచూసిన బుచ్చిబాబు తారక్ తో ఇప్పట్లో సినిమా చేయడం సాధ్యం కాదని ఫిక్స్ అయ్యి చరణ్ తో ప్రాజెక్ట్ దిశగా అడుగులు వేశారు. తారక్ కు ఏ కథ చెప్పారో అదే కథను బుచ్చిబాబు చరణ్ కు చెప్పి ఒప్పించారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. తారక్ సూచనల మేరకు బుచ్చిబాబు ప్రాజెక్ట్ కు చరణ్ అంగీకరించారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. శంకర్ ప్రాజెక్ట్ పూర్తైన వెంటనే ఈ ప్రాజెక్ట్ ను చరణ్ మొదలుపెట్టే ఛాన్స్ అయితే ఉంది.

చరణ్ ప్రస్తుతం 70 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుండగా 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. కొత్త నిర్మాత నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వరాల్లో వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ కు సన్నిహితుడైన కొత్త నిర్మాత ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనున్నారు. చరణ్ ఎంతోమంది కొత్త నిర్మాతలను టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.

చరణ్ ప్రాజెక్ట్ లు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా తెరకెక్కుతుండగా చిరంజీవి కూడా చరణ్ సినిమాల కథల విషయంలో తన వంతు సహాయం చేస్తున్నారు. చరణ్ తర్వాత ప్రాజెక్ట్ లతో తన రేంజ్ ను పెంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే ప్రాజెక్ట్ లలో చరణ్ నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus