Ram Charan, Upasana: పెళ్లి రోజు సందర్భంగా భార్య తో దిగిన కొత్త ఫోటోని షేర్ చేసిన చరణ్..!

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌, ఉపాసన.. టాలీవుడ్లో ఉన్న బెస్ట్ కపుల్స్ లో ఒకరు.ఈ జంటకి ప్రేక్షకులకు చాలా స్పెషల్. ఎందుకంటే ఈ ఇద్దరు చాలా బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు. కుటుంబం పట్ల మాత్రమే కాదు సమాజం పట్ల కూడా చరణ్- ఉప్సీ చాలా బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు.జూన్‌ 14న వీరి పెళ్లిరోజు. ఇది వారికి 10 వ పెళ్లిరోజు కూడా..! ఈసారి చాలా స్పెషల్ కాబట్టి… దానిని సెలబ్రేట్ చేసుకునేందుకు ఇటలీ టూర్‌కు వెళ్ళింది ఈ జంట.

ఎప్పటికప్పుడు అక్కడ తీసుకున్న ఫోటోలను షేర్‌ చేస్తూనే ఉంది ఈ జంట. ఇందులో ఇద్దరు వైట్ అండ్ వైట్ దుస్తుల్లో దిగిన ఓ ఫోటో హైలెట్ గా నిలిచింది. ఈ ఫోటోని షేర్‌ చేసిన చరణ్‌…క్యాప్షన్ వంటిది ఏమీ పెట్టినట్టు లేడు…! కానీ చూట్టూ పచ్చని చెట్లు, గార్డెన్‌ మధ్యలో దిగిన ఫోటో కాబట్టి చాలా బాగుంది. ఊబర్ కూల్ అనే విధంగా ఈ ఫోటో ఉంది. ఇక ఈ ఫోటోకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

అభిమానులు ఈ జంటకి అడ్వాన్స్ గా పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ’10 ఏళ్ళ బంధం’ అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. 2012 జూన్‌ 14న చరణ్- ఉప్సీ ల పెళ్లి జరిగింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రాన్ని చేస్తున్న చరణ్.. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఓ చిత్రం చేయబోతున్నాడు. అలాగే ‘విక్రమ్’ దర్శకుడు లోకేష్ కనగరాజన్ తో కూడా ఓ మూవీ చేయబోతున్నట్టు వినికిడి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus