NTR, Charan: చరణ్ వర్సెస్ తారక్.. ఆరోజే లెక్కలు తేలనున్నాయా?

  • March 25, 2023 / 03:08 PM IST

ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్, తారక్ (NTR, Charan) లలో ఎవరు అద్భుతంగా నటించారనే ప్రశ్నకు వేర్వేరు సమాధానాలు వినిపిస్తాయి. కొంతమంది మాత్రం ఇద్దరు హీరోలు అద్భుతంగా నటించారని చెబితే మరి కొందరు మాత్రం తమ ఫేవరెట్ హీరోనే బాగా చేశారని సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. అయితే చరణ్, తారక్ ప్రస్తుతం వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. చరణ్ శంకర్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉండగా తారక్ కొరటాల శివ సినిమాతో బిజీ కానున్నారు.

ఈ రెండు సినిమాలు కేవలం మూడు నెలల గ్యాప్ తో థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం చరణ్, తారక్ సోలో హీరోలుగా ఎంత మార్కెట్ ను కలిగి ఉన్నారో తేలిపోనుంది. ఈ ఇద్దరు హీరోలలో ఎవరు పైచేయి సాధిస్తారో తెలియాలంటే మాత్రం మరో 13 నెలలు ఆగాల్సిందే. ఈ రెండు సినిమాలు దాదాపుగా సేమ్ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఈ రెండు సినిమాలకు ఏ రేంజ్ లో బిజినెస్ జరుగుతుందో కూడా చూడాల్సి ఉంది.

శంకర్, కొరటాల శివలలో ఏ దర్శకుడిని తక్కువగా అంచనా వెయ్యలేం. ప్రతి సినిమాలో మెసేజ్ ఉండే విధంగా ఈ ఇద్దరు దర్శకులు జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. చరణ్, తారక్ లలో ఎవరి సత్తా ఎంతో ఈ సినిమాలతో తేలిపోనుంది. ఈ ఇద్దరు హీరోలు వేర్వేరుగా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఆర్.ఆర్.ఆర్ మూవీ సక్సెస్ ఏ హీరోకు ప్లస్ అయిందో కూడా ఈ సినిమాలతో తేలిపోయింది. చరణ్, తారక్ వేర్వేరుగా 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు. ఈ ఇద్దరు హీరోల మార్కెట్ గురించి తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ స్టార్ హీరోల భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై కూడా మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus