Ram Charan,Upasana: రాంచరణ్- ఉపాసనల టూర్ల వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

రాంచరణ్, ఉపాసన టాలీవుడ్లో ఎంతో అన్యోన్యంగా ఉంటున్న దంపతుల్లో ఒకరు.ఈ జంటకు బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. రాంచరణ్ పెళ్ళికి ముందు చాలా నెగిటివిటీని ఫేస్ చేసేవాడు. అయితే ఉపాసనని పెళ్లి చేసుకున్న తర్వాత అతని పై నెగిటివిటీ పోయింది. రాంచరణ్ లుక్స్ ను కంప్లీట్ గా మార్చేసింది ఉపాసన.అతని పై ఎన్ని విమర్శలు వచ్చినా చిరు నవ్వుతో ఎదుర్కోవడం. మెచ్యూరిటీ చూపించడం జరుగుతుంది. ఇక చరణ్ తీసుకునే ఫుడ్ విషయంలో, డ్రెస్సింగ్ విషయంలో ఉపాసన స్పెషల్ కేర్ తీసుకుంటుంది అన్న సంగతి తెలిసిందే.

కొణిదెల వారి ఇంటి కోడలిగానే కాకుండా అపోలో హాస్పిటల్స్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకుంది ఉపాసన. ఇక రాంచరణ్ సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీ కోసం సమయం కేటాయిస్తూ పక్కా ఫ్యామిలీ పర్సన్ అనిపించుకుంటున్నాడు. ముఖ్యంగా తన భార్య ఉపాసనతో కలిసి టూర్లు ఎక్కువగా వేస్తుంటాడు అన్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరి 10వ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ను ఇటలీలో జరుపుకున్నారు.

అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాంచరణ్, ఉపాసన..లు ట్రావెలింగ్ కు బాగా ఆకర్షితులు.క్రిస్మస్, పుట్టినరోజు, పెళ్లి రోజు.. ఇలా ఏ వేడుక వచ్చినా కచ్చితంగా విదేశాలకు టూర్స్ వేస్తుంటారు. ఓ సందర్భంలో రాంచరణ్, ఉపాసనలు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది వచ్చే వాళ్ళ పెళ్లిరోజు ని వివిధ ప్రదేశాల్లో సెలబ్రేట్ చేసుకోవాలి అని పెళ్ళికి ముందే తీర్మానించుకున్నట్టు వెల్లడించారు.

ఏ సంవత్సరం ఏ టూర్ వేయాలి అనే విషయం పై ఓ లిస్ట్ ను కూడా తయారు చేసుకున్నారట. వీళ్ళిద్దరూ నేచర్ లవర్స్, అలాగే ఎక్కువగా జంతువులు ఉండే ప్రదేశాలకి వెళ్లడానికి ఇష్టపడతారు.ఒకసారి వీళ్ళు సౌత్ ఆఫ్రికా కి కూడా టూర్ కి వెళ్ళొచ్చారు. ఇక వీళ్ళు ఇప్పటివరకు వీళ్ళు వేసిన టూర్లకు సంబంధించిన ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus