RGV: హీరోయిన్లందరూ నాన్ లోకలే : ఆర్జీవీ

  • June 26, 2021 / 06:07 PM IST

టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అయితే ఈసారి ఎన్నికలు సంచలనం సృష్టించేలా ఉన్నాయి. సెప్టెంబర్ లో జరగాల్సిన ఎన్నికలకు మూడు నెలల ముందు నుండే హడావిడి మొదలైపోయింది. ‘మా’ అధ్యక్షుడి స్థానం కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ బరిలోకి దిగారు. ఈ క్రమంలో ఇప్పటికే టాలీవుడ్ మూడు వర్గాలుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్.. మెగాస్టార్ మద్దతుని సంపాదించగా.. విష్ణు.. సూపర్ స్టార్ కృష్ణ, రెబెల్ కృష్ణంరాజుల మద్దతును సంపాదించుకున్నారు. ఇక ప్రకాష్ రాజ్ ఇప్పటికే తన ప్యానల్ సభ్యులను ప్రకటించారు.

ఈ క్రమంలో కన్నడిగుడైన ప్రకాష్ రాజ్.. ‘మా’ అధ్యక్ష పదవికి ఎలా పోటీ చేస్తారంటూ లోకల్-నాన్ లోకల్ ఇష్యూ తెరపైకి వచ్చింది. దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రకాష్ రాజ్ నటన చూసి నాలుగు సార్లు ఈ దేశం అతడిని జాతీయ అవార్డుతో సత్కరిస్తే నాన్ లోకల్ అనడం ఏంటని ప్రశ్నించారు ఆర్జీవీ. ”ముప్పై ఏళ్లుగా ప్రకాష్ రాజ్ ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకొని, చలం పుస్తకాలని మళ్ళీ తనే ముద్రించి , పెళ్ళాం పిల్లలతో ఇక్కడే ఉంటూ , తెలంగాణ లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని, అక్కడున్న ఎంతో మంది ఆడవాళ్ళకి పని కల్పిస్తున్న వాడు నాన్ లోకలా?” అంటూ ప్రశ్నించారు.

మీరందరూ ప్రేమించే హీరోయిన్స్ అందరూ నాన్ లోకల్ అని.. మైఖేల్ జాక్సన్ నాన్ లోకల్ .. బ్రూస్ లీ నాన్ లోకల్..రాముడు సీత కూడా నాన్ లోకల్ అంటూ కౌంటర్లు వేశారు వర్మ. ”కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే, గుడివాడ నుంచి చెన్నైకి వెళ్లిన రామారావుగారు, నాగేశ్వరరావుగారు.. బుర్రిపాలెం నుంచి మద్రాస్ వెళ్లిన కృష్ణగారు,తిరుపతి నుండి మద్రాస్ బయల్దేరిన మోహన్ బాబు గారు లోకలా..? ఎలా ఎలా ఎలా..?” తనదైన స్టైల్ లో ట్వీట్లు పెట్టారు వర్మ.


Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus