RGV: మెగా ఫ్యాన్ గా నేను హర్టు.. ఆర్జీవీ కామెంట్స్!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి మెగాఫ్యామిలీపై కామెంట్స్ చేశారు. చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ సినిమాలోని ‘భలే భలే బంజారా’ సాంగ్ విడుదల తేదీని ప్రకటిస్తూ.. రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో చూసి వర్మ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరోసారి అల్లు అర్జున్ టాపిక్ తీస్తూ.. వర్మ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో మెగాఫ్యామిలీను టార్గెట్ చేస్తూ వర్మ వరుసగా ట్వీట్లు చేస్తోన్న సంగతి తెలిసిందే.

Click Here To Watch NOW

ఫ్యూచర్ ట్రెండ్ మొత్తం అల్లు ఫ్యామిలీదే అన్నట్లుగా తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వర్మ. దీంతో మెగా-అల్లు ఆఫ్యామిలీ అభిమానులు మధ్య సోషల్ మీడియా వేదికగా చిన్నపాటి యుద్ధం జరుగుతోంది. తాజాగా ‘ఆచార్య’ ప్రమోషన్ వీడియోను అల్లు అర్జున్ ను పొగడానికి వాడుకున్నారు వర్మ. ‘ఆచార్య’ టీమ్ విడుదల చేసిన ఆ వీడియోలో.. నువ్ నన్ను డామినేట్ చేయొద్దంటూ చిరంజీవి.. రామ్ చరణ్ ని అడగడం.. దానికి అతడు సమాధానాలు ఇవ్వడం చాలా ఫన్నీగా సాగింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీంతో ఇదే వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన వర్మ.. ‘తగ్గను తగ్గను.. అంటూ అల్లు అర్జున్ తగ్గదేలే డైలాగ్స్‌తో మెగా ఫాదర్, మెగా సన్ అనుకుంటూ ఉండటం చూసి నేను మెగా హర్ట్ అయ్యాను. ఇక్కడ బన్నీ డైలాగులు వాడటం చూస్తుంటే న్యూ మెగా హీరో అల్లు అర్జునే అని రామ్ చరణ్, చిరంజీవి రుజువు చేసినట్లు ఉంది’ అంటూ రాసుకొచ్చారు.

దీంతో వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంలో కొందరు వర్మను తిడుతుంటే.. మరికొందరు మాత్రం పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ‘ఆచార్య’ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కాజల్, పూజాహెగ్డే హీరోయిన్లుగా నటించారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus