RGV: ఇంజనీరింగ్ లో వర్మ ఏ క్లాస్ లో పాసయ్యారో తెలుసా?

సంచలనాత్మక దర్శకుడు రాంగోపాల్ వర్మ బిటెక్ పూర్తి చేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా బీటెక్ పూర్తి చేసినటువంటి ఈయన తన బీటెక్ అయిపోయిన 37 సంవత్సరాలకు తన ఇంజనీరింగ్ డిగ్రీ అందుకున్నట్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది. తాజాగా విజయవాడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అకాడమిక్ ఎగ్జిబిషన్ కి గెస్ట్ గా వర్మ హాజరయ్యారు.. ఇలా గెస్ట్ గా వెళ్లినటువంటి ఈయనని యూనివర్సిటీ సత్కరించడమే కాకుండా తన బిటెక్ డిగ్రీని కూడా వర్మకి అందజేశారు.

ఈ క్రమంలోనే ఈ ఫోటోని ఈయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. వర్మ విజయవాడ లోని వి ఆర్ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. అయితే ఈయన తన ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ బీటెక్ పాసైన 37 ఏళ్లకు ఇంజనీరింగ్ సర్టిఫికెట్ అందుకోవడం చాలా థ్రిల్లింగ్ గా ఉందనీ తెలిపారు. 1985 నుంచి ఎప్పుడు ఈ సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ పై ఆసక్తి కలగలేదు.

థాంక్యూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ” అంటూ తన సెరిటిఫికేట్ షేర్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ తో పాటు మరికొన్ని ట్వీట్స్ కూడా చేశాడు. ఆ ట్వీట్స్ నెటిజెన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోని యూనివర్సిటీ ప్రొఫెసర్లతో కలిసి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ ఎంతో గొప్ప చదువులు చదివిన యూనివర్సిటీ ప్రొఫెసర్ల మధ్య చదువుకొని నేను అంటూ మరొక ట్వీట్ చేశారు. ఇక యూనివర్సిటీలోని విద్యార్థులతో వర్మ మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక ఫోటోని కూడా షేర్ చేశారు.

ఈ ఫోటోని షేర్ చేస్తూ అక్కడ విద్యార్థులను చెడగొట్టాలని నేను చాలా ప్రయత్నాలు చేశాను కానీ అందుకు భిన్నంగా వాళ్లే నన్ను చెడగొట్టారు అంటూ మరొక ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి అయితే ఈయన షేర్ చేసిన తన ఇంజనీరింగ్ సర్టిఫికెట్ కనుక చూస్తే వర్మ తన ఇంజనీరింగ్ సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యారని తెలుస్తుంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus