ప్రస్తుత కాలంలో వైవాహిక జీవితానికి ఏమాత్రం ప్రాధాన్యత లేదు. అందుకే ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజుకి అధికమవుతుంది. ఈ విషయంలో సినిమా సెలబ్రిటీల నుంచి మొదలుకొని సాధారణ వ్యక్తుల వరకు కూడా తమ జీవిత బాగ స్వామితో విడిపోవడానికి ఏమాత్రం ఆలోచించడం లేదు.పిల్లలు పుట్టి వారు పెళ్లీడుకొస్తున్న సమయంలో కూడా కొందరి మధ్య తలెత్తిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది విడాకుల బంధంతో వేరుపడ్డారు.
అయితే ఇలా విడాకులు తీసుకొని విడిపోవడానికి ఎవరి కారణాలను వారు చూపిస్తున్నారు. అయితే ఎక్కువమంది విడాకులు తీసుకొని విడిపోవడానికి గల కారణాలను తెలియజేస్తూ ప్రముఖ సంచలనాత్మక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రాంగోపాల్ వర్మ విడాకుల గురించి మాట్లాడుతూ కేవలం రెండే రెండు కారణాల వల్ల పెళ్లైన జంట విడాకులు తీసుకొని విడిపోతున్నారని ఈయన తెలియజేశారు.
మనదేశంలో 100% విడాకులు పెరగడానికి గల కారణం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, నాలెడ్జ్ లేకపోవడమే కారణమని ఈయన తెలియజేశారు. ఈ రెండు కారణాలవల్లే విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతుందని తెలిపారు. ఒక మనిషి తన జీవితంలో చేసే తప్పు ఏంటంటే అది తన కోసం కాకుండా ఇతర వ్యక్తుల కోసం బ్రతకడమేనని తెలిపారు.
నేను విడాకుల బంధం నుంచి బయటపడ్డాను కనుక చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ ఈ సందర్భంగా వర్మ విడాకుల గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే కొందరు వర్మ మాటలను ఏకీభవించగా మరికొందరు మాత్రం ఈయన మాటలను తప్పుపడుతున్నారు. ఏది ఏమైనా వర్మ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.