“ట్విట్టర్ ఎకౌంట్ డిలీట్ చేశాడు, సైలెంట్ అయిపోయాడు. సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నాడు, సొల్లు కబుర్లు చెప్పడం మానేశాడు” అని వర్మ గురించి అనుకుంటున్నోళ్ళందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిన్నమొన్నటివరకూ సినిమా హీరోహీరోయిన్లు, ఎమ్మెల్యే, ఎం.పిల వరకే పరిమితమైన వర్మ ఆన్లైన్ పెర్వర్షన్ ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపైనే సర్కాస్టిక్ కామెంట్స్ వేసే స్థాయికి వచ్చేశాడు.
మొన్నామధ్య అమరావతి డిజైన్స్ పరిశీలన కోసం చంద్రబాబు ప్రత్యేకంగా రాజమౌళిని నియమించిన విషయం ఇంటర్నెట్ లో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై కాస్త ఘాటుగా తనదైన శైలిలో వ్యంగ్యంగా రియాక్ట్ అయ్యాడు వర్మ. “ఆ అసెంబ్లీ కట్టే బదులు.. గ్రీన్ మ్యాట్ లో షూట్ చేసి రాజమౌళికి ఇస్తే “బాహుబలి” స్థాయిలో ఔట్ పుట్ ఇస్తాడు, మీకు బడ్జెట్ మిగులుతుంది” అంటూ ట్వీటేశాడు. ఆ ట్వీట్ ప్రస్తుతం వైరెల్ అయ్యింది. మరి తెలుగుదేశం కార్యకర్తలు, మెంబర్స్ ఎస్థాయిలో రియాక్ట్ అవుతారో చూడాలి.