దశాబ్దాలక్రితం విజయవాడలో జరిగిన వర్గపోరు నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన “వంగవీటి” అనే సినిమా ఈనెల 23 న విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది. వాస్తవాలు పక్కనబెట్టి సినిమా తీశారని వంగవీటి కుటుంబీకులు, ఆయన అభిమానులు ఆందోళన చేస్తున్నారు. కేవలం డబ్బు కోసం, చీప్ పబ్లిసిటీ కోసం రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా తీశారని విమర్శిస్తున్నారు. పకోడిగాడు సినిమా తీశాడు, ఆ యదవ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదంటూ సోమవారం వంగవీటి రాధకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీటన్నిటికీ రామ్ గోపాల్ వర్మ గట్టిగా సమాధానం ఇచ్చారు. వర్మ చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే..
“రంగాగారి క్యారెక్టర్ని వక్రీకరించానన్న రాధా కామెంట్లకి నా సమాధానం
1. రంగా గారు బోసిపళ్ల మహాత్మా గాంధీ అని చూపించాలా?, మర్డర్ల మాట అటుంచి ఎవర్ని మొట్టికాయ కూడా కొట్టలేదని చూపించాలా?, మదర్ థెరిస్సా కన్నా సాత్వికుడు అని చూపించాలా?, అన్న దానాలు, ప్రజా సేవ తప్ప చీమకైనా హాని చెయ్యని గౌతమ బుద్దుడని చూపించాలా?.
వాస్తవాలే చూపించాల్సిందన్న రాధా డిమాండ్లకి నా సమాధానం ..
రంగాగారి గురించి ఆయన భార్య గురించి, రంగాగారి అభిమానులు వినటానికి, చూడటానికి ఇష్టపడని డాక్యుమెంటేడ్ వాస్తవాలు నేను చాలా చూపించగలను. కాని రంగా గారి మీద వున్న గౌరవంతో అవి చూపించలేదు. దమ్ముండి ఆ వాస్తవాలు ఏమిటని రాధా డిమాండ్ చేస్తే వాటన్నింటిని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా. నేను ముందునుంచి చెప్తున్నది వంగవీటి సినిమా తియ్యడంలో నా ఉద్దేశ్యం ఆ జీవిత కథల ఆధారంగా అప్పుడు జరిగిన ఆ సంఘటనల వెనుక వాళ్ళ సున్నితమైన భావోద్వేగాలని చూపించడం మాత్రమే.” అని స్పష్టం చేశారు. ఇంకా మాట్లాడుతూ ” ఒరిజినల్ వంగవీటి రాధా, వంగవీటి రంగా గార్లలో ఉన్నగొప్పతనంలో ఈ రాధాకి 0.1%లేకపోవడం మూలానే ఈ రాధా పరిస్థితి ఇలా వుంది. ఏమి అర్ధం చేసుకోకుండా మాట్లాడుతున్నాడు. నేను తీసిన వంగవీటి సినిమా కరెక్ట్ కాదనుకుంటే రాధాని “అసలు వంగవీటి”అని ఇంకో సినిమా తీసి లోకానికి చూపించుకోమనండి. ఇకపోతే నన్నేదో చేసేస్తానన్న రాధా ఇచ్చిన వార్నింగ్ కి నా కౌంటర్ వార్నింగ్. బస్తీ మే సవాల్.” అంటూ సవాల్ విసిరారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.