Pushpa Trailer: బన్నీ మాత్రమే సూపర్ స్టార్ అంటున్న వర్మ!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప పార్ట్1 ఈ నెల 17వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా నిన్న విడుదలైన పుష్ప ట్రైలర్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ ట్రైలర్ కు దాదాపుగా 11 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. పుష్ప ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉందని బన్నీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ట్రైలర్ లో చిత్తూరు యాసలో బన్నీ, రష్మిక చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా ట్రైలర్ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ మాత్రమే సూపర్ స్టార్ అని పుష్పరాజ్ లాంటి రియలిస్టిక్ పాత్రల్లో నటించడానికి బన్నీ భయపడలేదని వర్మ తెలిపారు. పవన్, రజినీకాంత్, మహేష్ బాబు, చిరంజీవిలాంటి వాళ్లు ఇలాంటి పాత్రలు చేయగలరా? అని వర్మ ప్రశ్నించారు.

“పుష్ప అంటే ప్లవర్ కాదు.. ఫైర్” అంటూ పుష్ప ట్రైలర్ లోని డైలాగ్ ను వర్మ పోస్ట్ లో రాసుకొచ్చారు. పుష్ప, శ్రీవల్లి మధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా కొత్తగా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ నెలలో విడుదలైన అఖండ సక్సెస్ సాధించగా పుష్ప కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందేమో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై 180 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరగగా ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Share.