Ram Pothineni: అభిమాని చేసిన పనికి ఎమోషనల్ అయిన రామ్.. ఏమైందంటే..!

హీరోలకి అభిమానులండడం సహజం. కానీ కొంత మంది హీరోలకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు. హీరోల పై తమ అభిమానాన్ని చూపించడానికి వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తుంటారు. అలాంటి అభిమానులు మన ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి కూడా ఉన్నారు. అవును ‘ఇస్మార్ట్ శంకర్’ తో రామ్ కి మాస్ లో ఫాలోయింగ్ బాగా పెరిగింది. అతనికి కూడా అభిమాన సంఘాలు భారీగా ఏర్పడ్డాయి.

రామ్ అభిమానుల తీరు ఎలా ఉంటుందో సోషల్ మీడియాలో తరచూ మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ అభిమాని అయితే ఏకంగా తన కొడుక్కి రామ్ నటించిన ఓ సినిమా పేరు పెట్టుకుని అందరికీ షాకిచ్చాడు. విషయంలోకి వెళితే.. రామ్ కి హరి హర అనే వీరాభిమాని ఉన్నాడు. ఇతనికి ఇటీవల కొడుకు పుట్టాడు. ఇక నామకరణం రోజున అతని కొడుక్కి ‘స్కంద’ అని పేరు పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని అతని స్నేహితుడు సందీప్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

హరి హర అభిమానాన్ని చూసి (Ram Pothineni) రామ్ చలించిపోయాడు.దీంతో వెంటనే తన ట్విట్టర్ ద్వారా స్పందించిన రామ్.. ” నాకు మాటలు రావడం లేదు. ఆ ‘స్కంద'( సుబ్రహ్మణ్య స్వామి) ఆశీస్సులు మీ బిడ్డకు ఎల్లప్పుడూ ఉంటాయి. దేవుడు మిమ్మల్ని & మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు” అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చాడు. ఇక రామ్ హీరోగా రూపొందిన ‘స్కంద’ మూవీ సెప్టెంబర్ 28 న విడుదల కాబోతోంది. బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో అంచనాలు మరింతగా పెరిగాయి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus